మిర్చి పంటకు బోనస్‌ ప్రకటించాలి

మిర్చి పంటకు బోనస్‌ ప్రకటించాలి - Sakshi


- రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

- రూ.100 కోట్లతో ప్రత్యేక నిధిని కేటాయించాలని వినతి




సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర లేక రైతుల వద్ద మిగిలిపోయిన మిర్చి పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మద్దతు ధర లేక ఖమ్మంలో ఆందో ళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం బాధాకరమన్నారు. శనివారం ఢిల్లీ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లా డుతూ.. మిర్చి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని, రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల వద్ద మిగిలిన పంట కొనుగోలుకు ఒక ధర నిర్ణయించి, దానికి అదనంగా బోనస్‌ ప్రకటించా లని కోరారు.



మిర్చి రైతులను ఆదుకోవడాన్ని కేంద్రం విస్మ రించిందని ఎంపీ కవిత చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతు ధర నిర్ణయించలేదని, ఈ విషయంలో రైతులను ఆదుకోవడానికి మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ స్కీం (ఎంఐఎస్‌) కింద పంట కొను గోలుకు నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిర్చి మద్దతు ధరపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌తో చర్చించామని చెప్పా రు. గతేడాది మిర్చి పంటకు మద్దతు ధరకు మించి రైతులకు లాభాలు వచ్చాయని, దీంతో ఈ ఏడాది రైతులు పెద్ద ఎత్తున మిర్చి సాగు చేయడం వల్ల ధర పడిపోయిందన్నారు. సాగుపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వారి పంట నిల్వకు కోల్డ్‌ స్టోరేజీలను ఉచితంగా ఇవ్వాలన్నారు.



రాష్ట్రంలో 2 వేల మొబైల్‌ ఏటీఎంలు

తపాలా శాఖతో కేంద్ర కార్మిక శాఖ ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లోని ఉపాధి కల్పన కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదని, తపాలా కేంద్రా ల్లో నమోదు చేసుకొనే వెసులుబాటు కల్పించి నట్టు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో 36, ఏపీలో 56 పోస్టల్‌ కేంద్రాల్లో ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా త్వరలో తెలంగాణలోని 2 వేల గ్రామాల్లో మొబైల్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. వాటి ద్వారా పింఛన్లు, గ్యాస్‌ సబ్సిడీ, ఉపాధి హామీ పథకం నిధులను పోస్టల్‌ సిబ్బంది ఇంటికే వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.



కేఎల్‌ఎస్‌ఎస్‌ కింద ఈపీఎఫ్‌వో సభ్యులకు రూ. 2.20 లక్షలు

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు ఇళ్ల నిర్మాణానికి క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీం–2017లో భాగంగా సబ్సిడీ ఆన్‌ ఇంట్రస్ట్‌ కింద రూ.2.20 లక్షలు మంజూరు చేయనున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో సభ్యులు 10 మంది ఒక సహకార బృందంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రూ.6–12 లక్షల లోపు రుణాలపై 3 శాతం వడ్డీ సబ్సిడీ, రూ.18 లక్షల వరకు రుణాలపై 4 శాతం వడ్డీ సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి సబ్‌స్క్రైబర్లు ఇంటి నిర్మాణానికి 90 శాతం నిధులు తీసుకోవచ్చని తెలిపారు. ఈ స్కీం కింద రెండేళ్ల లోపు 10 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top