అంగన్‌వాడీలకు కొత్తరూపు


 ప్లే స్కూళ్లుగా మారుతున్న పాఠశాలలు

 శంషాబాద్‌లో తొలిసారిగా ఏడు కేంద్రాలు

 రాజేంద్రనగర్‌లోని మూడు కేంద్రాల్లో ఇక డిజిటల్ క్లాసులు




శంషాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలు సరికొత్త రూపు దాల్చుకుంటున్నాయి. ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా తయారవుతున్నాయి. మెదక్ జిల్లాలోనే తొలిసారిగా రాజేంద్రనగర్ ఐసీడీఎస్ పరిధిలో పదికేంద్రాలు ఆదర్శ అంగన్‌వాడీలుగా అవతరిస్తున్నాయి. ఐసీడీఎస్ ఆయా కేంద్రాలను ఎంపిక చేయడంతో పాటు అందులో దశలవారీగా సౌకర్యాలు సమకూర్చే పనిలో అధికారులు పడ్డారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏడాదిగా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని ఓ కేంద్రంలో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులు విజయవంతం కావడంతో ప్రభుత్వ అనుమతితో మరో పది కేంద్రాలను ఆదర్శ అంగన్‌వాడీలుగా మార్చాలని నిర్ణయించారు. ఇవి జూన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి.                      

 

జిల్లాలో ఆదర్శ అంగన్‌వాడీలుగా మారుస్తున్న కేంద్రాల్లో ఇకనుంచి చిన్నారులకు ఐప్యాడ్‌పై డిజిటల్ తరగతులు నిర్వహించనున్నారు. ఏబీసీడీలు, రైమ్స్ నేర్పించనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన కేంద్రాల టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా ఇప్పిస్తున్నారు. ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే విద్యుత్‌తో పాటు తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులన్నింటినీ ప్రభుత్వ అనుమతితో రాజేంద్రనగర్ ఐసీడీఎస్ పరిధిలోకి పదికేంద్రాలను ఆదర్శ అంగన్‌వాడీలుగా తీర్చిదిద్దుతున్నాం. ఇ ప్పటికే కొన్ని చోట్ల ఏర్పాట్లు చేశాం, శంషాబాద్‌లో ఏడు, రాజేంద్రనగర్‌లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశాం.


ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా ఐ పాడ్‌తో డిజిటల్ తరగతులు ఇందులో ప్రారంభించనున్నాం. ఇతరత్రా సౌకర్యాలు కూడా సమకూర్చుతున్నాం. - నిర్మల, రాజేంద్రనగర్ సీడీపీఓ పూర్తి చేస్తున్నారు. ఆదర్శ అంగన్‌వాడీ భవనాలను ప్లే స్కూళ్ల మాదిరిగా సరికొత్త పెయింటింగ్‌లు వేయించారు. గోడలపై బొమ్మలతో పాటు ఏబీసీడీలు ఇతరత్రా ఆక ర్షణీయమైన బొమ్మలతో అలరించేలా మార్చుతున్నా రు. చిన్నారులు ఆడుకోడానికి గతంలో కన్నా మెరుగైన విధంగా చెక్కబొమ్మలు, జంతువుల బొమ్మలు ఇతరత్రా సామాగ్రిని కూడా ఈ కేంద్రాలకు ఇప్పటికే సరఫరా చేశారు.

 

శంషాబాద్‌లో ఏడు కేంద్రాలు

జిల్లాలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా  శంషాబాద్‌లో వీక రసెక్షన్ కాలనీ, సిద్ధంతి, ఇందిరానగర్ దొడ్డి, కుమ్మరిబస్తీ, అహ్మద్‌నగర్, ఎయిర్‌పోర్టు కాలనీ, కొత్వాల్‌గూడ వీటితో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పద్మశాలిపురం బస్తీలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఆదర్శ కేంద్రాలుగా మారాయి. చిన్నారులు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు తరలిపోకుండా ఐసీడీఎస్ అధికారులు ఆయా ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల సమీపం లో ఉన్న తల్లులకు వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లే స్కూళ్లకు ఏమాత్రం తక్కువ కాకుండా చిన్నారులకు పోషకాహారంతో పాటు మంచి విద్య ఇక్కడ లభిస్తుందని చెబుతున్నారు.



మెదక్ జిల్లాలోనే తొలిసారిగా శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలని తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం. శంషాబాద్ సెక్టార్ పరిధిలోని కొత్వాల్‌గూడలో ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న కేంద్రం విజయవంతంగా కొనసాగిస్తుండడంతో మరో పది కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.

 - కళావతి, ఐసీడీఎస్ సెక్టార్ సూపర్‌వైజర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top