పుష్కరాలు విజయవంతం


 జిల్లాకు రెండో స్థానం, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

 

  నిజామాబాద్ క్రైం : అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు విజయవంతమయ్యూయని ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన జిల్లాల్లో కరీంనగర్‌కు మొదటి స్థానం, నిజామాబాద్‌కు రెండో స్థానం దక్కడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని 11 ప్రాంతాల్లో 18 ఘాట్ల వద్ద జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఒక కోటి లక్ష మంది పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు.



జాతీయ రహదారి పక్కనే పోచంపాడ్ ఉండడంతో ైెహ దరాబాద్ నుంచి ఎక్కువ మంది పోచంపాడ్‌కు వచ్చారని, దీంతో అందరూ పోచంపాడ్‌కు వెళ్లకుండా.. సావెల్, దోంచందా, గుమ్మిర్యాల్, తడ్‌పాకకు భక్తులను తరలించి ట్రాఫిక్ రద్దీని నివారించామని వెల్లడించారు. ఇందల్‌వాయి టోల్‌గేట్ నుంచి పుష్కరాలకు వెళ్లే మార్గంలో ఘాట్ల వివరాలు తెలిపే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు.



 300 మంది ఎస్‌పీఓలు..

 300 మంది గ్రామీణ యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్‌పీఓ)గా రూట్ బందోబస్తుకు నియమించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వీరికి నిత్యం ఒక్కొక్కరికి రూ. 150 చెల్లించామని చెప్పారు. బాసరకు వెళ్లే మార్గంలో జిల్లా సరిహద్దు యంచ, కందకుర్తి, పోచంపాడ్ వద్ద 50 ఎకరాలకు స్థలాలను గుర్తించి పార్కింగ్ కోసం ఉపయోగించామని వెల్లడించారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల పోలీసు లు కూడా పుష్కరాల్లో విధులు నిర్వర్తిం చారని గుర్తుచేశారు.  



 ఆరుగురు మృతి..

 పుష్కర సమయంలో ముగ్గురు రోడ్డు ప్రమాదాలు, మరో ముగ్గురు గోదావరి నదిలో పడి చనిపోయినట్లు ఎస్పీ చెప్పా రు. తప్పిపోరుున 297 మందిని పోలీస్ కంట్రోల్ రూంకు తరలించి మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసి వారి వారి కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. 15 మంది బ్యా గ్‌లు పోగొట్టుకోగా.. 13 మందికి బ్యాగ్‌లు అప్పగించామని, 10 మంది సెల్‌ఫోన్లు పోగొట్టుకోగా 9 మందికి ఇప్పించామని ఎస్పీ గుర్తుచేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top