గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దుతా..


  • గంగదేవిపల్లి స్ఫూర్తితో ముందుకు సాగాలి

  • ప్రతి పంచాయతీకి 10 లెడ్ లైట్లు ఇస్తాం

  • సేంద్రియ వ్యవసాయం మేలు

  • కలెక్టర్ గంగాధర కిషన్

  • గీసుకొండ : మండలంలోని మిగిలిన 16 పంచాయతీలను ఇదే బాటలో నడిపి రాష్ట్రంలోనే గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ హామీ ఇచ్చారు. గీసుకొండ మండలంలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని శనివారం ఆయన తొలిసారిగా సందర్శించారు. గ్రామ  ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై గ్రామ సమగ్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.



    అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గంగదేవిపల్లి సాధిం చిన విజయాలను ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ తెలుసుకుని.... తమ గ్రామాలు అలా ఎందుకు కాకూడదని ఆలోచించాలన్నారు.  చాలా విషయాల్లో ఆదర్శంగా ఉన్న గంగదేవిపల్లిని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకోసం తన సహకారం ఉంటుందన్నారు. మన ఊరు-మన ప్రణాళిక కింద  ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుందని, దీని వల్ల అభివృద్ధి త్వరితగతిన సాగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి పది లెడ్ వీధిలైట్లు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.



    ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని... అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. పంచాయతీల్లో ఇంటి, నీటి పన్నును తప్పకుండా చెల్లించాలని, సర్పంచ్‌లకు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉన్నాయన్నారు. పన్నులు చెల్లిం చని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం చట్టప్రకారం పంచాయతీలకు ఉందన్నారు. పంటలపై పురుగుల మందులను అతిగా వాడితే అనర్థాలుంటాయని, గంగదేవిపల్లె రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ఆకాంక్షిం చారు. కూరగాయల పెంపకం చేపడితే రైతు బజార్‌లో గ్రామస్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రతి ఇంటివద్ద వర్మీ కంపోస్టు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.



    ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి...



    గంగదేవిపల్లిగ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, లింక్‌రోడ్లు వేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పందుల కుంటను స్టోరేజ్ ట్యాంకుగా ఏర్పాటు చేస్తామని, డంపింగ్ యార్డు తప్పనిసరిగా    ఉండాలని.. ఈ మేరకు సర్వే చేసి ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రజావసరాలకు ఉపయోగించేలా చూడాలని గీసుకొండ తహసీల్దార్ మార్గం కుమారస్వామిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలకు రెండు అదనపు తరగతి గదులు మంజూరు చేస్తానని, వీటికి సంబంధించిన ఎస్టిమేట్లను త్వరలో వేసి తీసుకుని రావాలని అధికారులు, సర్పంచ్‌కు సూచించారు.



    కాగా, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, అపార్డు ట్రైనింగ్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. సమావేశంలో ఎంపీడీఓ పారిజాతం, ఈఓపీఆర్‌డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, గ్రా మ అదర్శ అధికారి తిలక్‌గౌడ్, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ వేల్పుల సురే స్, సర్పంచ్ కూసం లలిత, ఉపసర్పంచ్ కూసం రాజమౌళి, పంచాయతీ కార్యదర్శులు శైలజ, వేణుప్రసాద్, ఐకేపీ సీసీ ర వీందర్‌రాజు, సింగిరెడ్డి జ్యోతి, గోనె కు మారస్వామి,చల్ల మలయ్య పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top