ఏసీబీ వలలో ‘అటవీ’ అధికారి


ఏసీబీ వలలో ఫారెస్టు రేంజ్ అధికారి

లంచం తీసుకుంటూ చిక్కిన మధుసూదన్‌రావు

ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడి

నర్సాపూర్ రూరల్:
రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్టు రేంజ్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన వైద్యనాథ్ సదాశివపేటలో టింబర్ డిపో పెట్టుకునేందుకు రెండు నెలల క్రితం మెదక్ డీఎఫ్‌ఓకు అర్జీ పెట్టుకున్నాడు. అనుమతుల కోసం నర్సాపూర్ రేంజ్ ఆఫీసర్ మధుసూదన్‌రావును సంప్రదించాలని డీఎఫ్‌ఓ సూచించడంతో అతడిని కలుసుకున్నాడు. అన్ని అనుమతులు పొందాలంటే రూ.50 వేలు ఖర్చవుతుందని, ముందుగా సీనియర్ అసిస్టెంట్‌ను క లుసుకోవాలని మధుసూదన్‌రావు.. వైద్యనాథ్‌కు సూ చించారు.



దీంతో రూ.2 వేలు సీనియర్ అసిస్టెం ట్‌కు ఇచ్చి తన ఫైల్‌ను మె దక్ డీఎఫ్‌ఓకు పంపించాలని కోరా డు. రెండు నెలలైనా ఫైల్‌కు మోక్షం కలగకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఏసీబీ అధికారులు వైద్యనాథ్ ద్వారా ఫారెస్టు ఆఫీసులోనే శుక్రవారం మధుసూదన్‌రావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు అధికారిపై గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ తెలి పారు. దాడుల్లో సీఐలు నవీన్‌కుమార్, ప్రతాప్‌కుమార్‌తో పాటు సిబ్బం ది ఉన్నారు.



 రెండు నెలల్లో ఇద్దరు అధికారులు

నర్సాపూర్ ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వీరేశంతో పాటు బీట్ ఆఫీసర్ ప్రేమ్‌సింగ్ సైతం రెండునెలల క్రితం ఇదే కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. ఇంతలోపే మరో అధికారి అవినీతి కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది.



 అటవీశాఖ అవినీతిపై అనేక ఆరోపణలు

 మెదక్ జిల్లా అటవీశాఖలో అనేక అవినీతి జరుగుతుందని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులపైనా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా, తీసుకున్నా 94404 46149 నంబర్‌లో సమాచారం అందించండి.             

                                                                                                                     - ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ

 

 విసిగిపోయి ఫిర్యాదు చేశా


 రూ.50 వేల లంచం కోసం అధికారులు నన్ను వేధించారు. చాలాసార్లు తిప్పించుకున్నారు తప్ప పనిచేయలేదు. కాబట్టే ఏసీబీ అధికారులను ఆశ్రయించా. అనుమతుల కోసమే ఇంత ఇబ్బంది పెడితే.. మున్ముందు ఇంకెన్ని అవస్థలు పడాలో అని ఆందోళన చెందుతున్నా.                             

                                                                                                                                      - వైద్యనాథ్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top