‘ఫీజు’ కోసం పోరు


- ఏఐఎస్‌ఎఫ్, టీజీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన

- అరెస్టు చేసిన పోలీసులు

 ప్రగతినగర్ :
పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అప్పటికే పోలీసులు కలెక్టరేట్ ఎదుట ముళ్లకంచె వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కలెక్టరేట్‌కు వచ్చి అక్కడే బైఠాయించి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



ముళ్ల కంచె దాటి లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయినా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ స్పష్టత ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిం   చారు. అరెస్టయిన వారిలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు దశరత్, చెలిమెల భాను ప్రసాద్, ముదాం నవీన్, అభిషేక్, అరుణ్, సుధీర్, పృథ్వీరాజ్, రమేష్, నాగరాజు, సాగర్, అఖిల ,ఆమని, వైష్టవి, గోదావరి తదితరులు ఉన్నారు.

 

టీజీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన..

తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ వద్ద భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ తీశారు. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు లాల్‌సింగ్ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కారించాలన్నారు. లేని ఎడల ప్రభుత్వంపై విద్యార్థి ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు శేఖర్, జైత్‌రాం, నరేష్, నవీన్, గణేష్, లింగం, జీవన్ తదితరులు ఉన్నారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top