మొత్తం వేటగాళ్లు ఏడుగురు


మహదేవపూర్‌ దుప్పుల వేట ఘటన



సాక్షి, భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దుప్పుల వేటకు సంబంధించి మొత్తం ఏడుగురు వేటగాళ్లు ఉన్నట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన వ్యక్తులకు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో వేటాడ టం అలవాటని, వీరికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం అక్బర్‌ఖాన్‌ పనని మహదేవ పూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రభాను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ జంతువుల ను వేటాడే అలవాటున్న మహదేవపూర్‌కు చెందిన అక్బర్‌ఖాన్‌ హైదరాబాద్, కరీంనగర్, మహదేవపూర్‌లకు చెందిన ఫజల్‌ అహ్మద్‌ ఖాన్, జలాల్, మున్నా మొజిన్, గట్టయ్య, మహమ్మద్‌ ఖలీమ్, మహమ్మద్‌ అస్రార్‌ ఖురేషీలను వేటకు ఆహ్వానించాడు.



వీరితో పాటు సత్యనారాయణ అలియాస్‌ షికారి సత్తన్న, అతని బంధువులు కార్లలో మహదేవ పూర్‌ చేరుకున్నారు. అక్కడ మద్యం తాగి అందరూ కలసి కారులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు పలిమెల ఫారెస్ట్‌ రేంజ్‌ సిబ్బంది టాటా ఇండికాను ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత మహదేవపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఆ వాహనాన్ని ఆపగా దానిలో ఉన్నవారు ఫారెస్టు సిబ్బందిని బెదిరించి ఆ ప్రదేశం వదిలి వెళ్లిపోయారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌  ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. ఈ కేసులో నిందితులైన నలువాల సత్యనారాయణ, మహమ్మద్‌ ఖలీమ్, అస్రార్‌ ఖురేషీలను ఇప్పటికీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.  



మంత్రుల ఒత్తిడి మాపై లేదు: విజిలెన్స్‌  

మహాదేవపూర్‌: ‘దుప్పుల వేట ఘటనలో కేసు మాఫీ చేయాలంటూ మంత్రులెవ్వరూ మాపై ఒత్తిడి తేలేదు. వేటగాళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అటవీశాఖ విజి లెన్స్‌ అడిషినల్‌ పీసీసీఎఫ్‌వో స్వర్గం శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వన్యప్రాణుల వేటకు సంబం ధించి వాస్తవాలను పరిశీలించేందుకు ఆయన ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌కు వచ్చారు. ఈ కేసులో విచార ణ వేగవంతం చేశామని చెప్పారు. పోలీసుల సహకారంతో ఇప్పటికే ముగ్గురు వేటగాళ్లను పట్టుకున్నామని, త్వరలోనే మిగతావారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. అనంతరం నిందితుల ఇళ్లు, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనా బాను ఇంటితోపాటు టీఆర్‌ఎస్‌ కార్యాలయం లో ఆయన సోదాలు నిర్వహించారు. వేటగాళ్లు ఉపయోగించిన ఇండికా కారును పరిశీలిం చారు. అంబట్‌పల్లిలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top