డీసీ తండాలో 98 % పోలింగ్


హన్మకొండ అర్బన్ : వరంగల్ ఉప ఎన్నికలో వర్ధన్నపేట నియోజకవర్గం డీసీ తండాలోని 193వ పోలింగ్ కేంద్రంలో 98 శాతం ఓట్లు పోలయ్యూరుు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు ఈ ఈవీఎంను సీజ్‌చేసి భద్రపరిచారు. 24న కౌంటింగ్ సందర్భంగా కూడా ఈ ఓట్లు లెక్కించలేదు. ఈ కేంద్రంలోని అధికారుల నిర్వాకం వల్ల జరిగిన తప్పిదాన్ని వెంటనే గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే సమస్యను రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ఆ ఓట్లు లెక్కించకుండా వదిలేశారు.



అసలేం జరిగింది...?

వర్ధన్నేపేట నియోజక వర్గం, అదే మండలంలోని డీసీ తండా 193వ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 678 ఓట్లు ఉన్నాయి. ఇవి కాక ఇటీవల అధికారులు ఓటర్ల జాబితా సవరణ సంద ర్భంగా గ్రామంలో లేని, మరణించిన వారి ఓట్లు మొత్తం 159 తొలగించారు. వీరిలో 77 పురుషులు, 82 మహిళల ఓట్లు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు అధికారులు బీఎల్‌వోల ద్వారా ఓటర్ల జాబితాలో ఉన్న అందరికీ పోల్‌చీటీలు పంపిణీ చేశారు. కాగా, పోలింగ్ రోజున అధికారికంగా ఉన్న జాబితాలోని 678 మందిలో కొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, జాబితా నుంచి తొలగించిన 159 మందిలోనూ సుమారు 90 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. తొలగింపుల జాబితాలో ఉన్నవారు ఓటు ఎలా వేశారు..? ఒకవేళ వారు వస్తే పీవో ఎలా ఓటింగ్‌కు అనుమతించారు అనేది తేలాల్సి ఉంది. అరుుతే తొలగింపు జాబితాలో ఉన్న వారి పేర్లను పోలింగ్ సిబ్బంది టిక్ పెట్టి ఓటు వే యించారని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇందుకు బాధ్యులెవరు.. ఉద్దేశపూర్వకంగా చేశారా.. పొరపాటున జరిగిందా అనే కోణంలో అధికారులు పూర్తిస్థారుులో విచారణ చేస్తున్నారు.



678 ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఉంటే రీపోలింగ్...

డీసీ తండా ఘటనపై తీసుకోవాల్సిన చర్యల గురించి కౌంటింగ్‌కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోటీ హోరాహోరీగా ఉండి.. మెజార్టీ 678 ఓట్లు లోపు ఉంటే విజేత ఫలితం ప్రకటించకుండా డీసీ తండాలో రీ పోలింగ్ చేపట్టాలని, వాటి లెక్కింపు అనంతరం తుది ఫలితం ప్రకటించాలని సూచించారు. దీంతో అధికారులు సిద్ధమైనప్పటికీ.. గెలుపొందిన అభ్యర్థి మెజార్టీ లక్షల్లో ఉండటంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. లేదంటే డీసీ తండాలో రీ పోలింగ్ తప్పనిసరి అయ్యేది.

 

పది కేంద్రాల్లో 90శాతానికి పైగా..


వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 1778 పోలింగ్ కేంద్రాల్లో కేవలం పదింట్లో మాత్రమే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే, ఆయా కేంద్రాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనివే కావడం విశేషం. అయితే, ఉద్యోగులు, విద్యావంతుల నియోజకవర్గంగా పేరున్న వరంగల్ పశ్చిమలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 30 శాతానికన్నా తక్కువగా పోలింగ్ నమోదైతే.. తండాలు, గ్రామాల్లో మాత్రం 90 శాతానికిపైగా ఓటేశారంటే గ్రామీణుల్లోని చైతన్యానికి నిదర్శనమని చెప్పొచ్చు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top