93 మంది అమరుల కుటుంబాలకు సాయం

93 మంది అమరుల కుటుంబాలకు సాయం - Sakshi


హన్మకొండసిటీ : తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కు టుంబాలను ఆదుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిల బెట్టుకున్నారని టీఆర్‌ఎస్ జిలా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. హన్మ కొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రత్యేక రాష్ర్టం కోసం ఎంతోమం ది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలకు పా ల్పడ్డారని గుర్తుచేశారు. అయితే స్వరాష్ర్టం కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనకాడ ని అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారన్నారు.



తమ ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం ఒక్కొక్కరి కి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసా యం మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 93 మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.9.03 కోట్ల సాయం అందించనుందని తెలిపా రు. తొలివిడత జాబితా లో పేర్లు లేనివారి వివరాలను టీఆర్‌ఎస్ కార్యాలయం లో, కలెక్టర్ కార్యాలయంలో త్వరలో అం దించాలని కుటుంబసభ్యులకు సూచిం చారు. అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు త్వరలో ఇళ్లు, అర్హత కలిగి వారికి ఉద్యోగం, భూమి లేని వారి కి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ఆయన పేర్కొన్నారు.

 

‘ఎర్రబెల్లి’కి మతిభ్రమించింది..


పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని తక్కళ్లపల్లి రవీందర్‌రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జిల్లా పరిషత్ వేదికపై అర్థంలేని వ్యాఖ్యలు చేయడం ఆయ న దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. మచ్చలేని నాయకుడు వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిపై విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కన్నెబోయిన రాజయ్యయాదవ్ మాట్లాడు తూ ఎమ్మెల్యే దయాకర్‌రావు కాలుకాలిన పిల్లిలా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీ కడియం శ్రీహరి పై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన అల్పబుద్ధికి నిదర్శనమన్నారు.



తాను టీఆర్‌ఎస్ పార్టీలోకి వస్తానని, మీ ఆశీర్వాదాలు ఉండాలని కడియం శ్రీహరికి ఫోన్ చేసింది నిజం కాదా అని నిలదీశారు. తమ పార్టీ నేతలపై వచ్చిరాని మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో టీజేఏ రాష్ట్ర అధ్యక్షు డు మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, నయీముద్దీన్, జోరిక రమేష్, బన్నే రాజేం దర్, రమేష్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top