నకిలీ ఎస్సై.. 84 కేసులు..

నకిలీ ఎస్సై.. 84 కేసులు.. - Sakshi

రూ.57లక్షలు, మూడు కార్లు, 10 బైక్‌లు చోరీ

 

ఎర్రుపాలెం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా కండిపాడు మండలం దామలూరుకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ, నకిలీ ఎస్సై ఐతం రవిశేఖర్‌ను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసులు ఆదివారం అరెస్టు చేసి మధిర కోర్టుకు రిమాండ్‌ చేశారు. ఎర్రుపాలెం వైరా ఏసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి విలేకరులకు నిందితుడి వివరాలు వెల్లడించారు. నింది తుడు రవిశేఖర్‌ ఎస్సై, విజిలెన్స్‌ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లోని దాదాపు 8 జిల్లాల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రా ల్లో 84 క్రిమినల్‌ కేసులున్నాయి.  గత నెల 19న ఓ నేరంపై జగ్గయ్యపేట జైలులో ఉన్న డు రవిశేఖర్‌ను ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు తాడేపల్లి గూడెం కోర్టులో హాజరుపరిచి.. తిరిగి తీసుకొస్తున్న క్రమంలో వారి కస్టడీ నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్‌ పరిధిలో తప్పించుకుని తిరుగుతున్నాడు.



ఈ ఘటనలో అక్కడి ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా.. రవిశేఖర్‌ ఈనెల 17న రాత్రి ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉన్న ఓ లారీ ఆఫీసుకు వచ్చా డు. లారీల్లో అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నారని.. కేసులు లేకుండా చేయాలంటే రూ.20వేలు ఇవ్వాలని లారీ యజమాని మొగిలి అప్పారావును డిమాండ్‌ చేశాడు. అప్పటికప్పుడు బెదిరించి రూ.5 వేల నగదు తీసుకున్నాడు.  ఈ విషయాన్ని అప్పారావు పోలీసులకు చేరవేయడంతో ఎస్సై ఆంజనేయులు, సిబ్బందితో వచ్చి నిందితుడు రవిశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top