వెంటిలేటర్‌పై ఏడుగురు


నిలకడగా 9 మంది విద్యార్థుల ఆరోగ్యం

 సాక్షి, హైదరాబాద్: మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల హాహాకారాలతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 108 వాహనాలతోపాటు, యశోద ఆస్పత్రి అంబులెన్‌‌సలో 22 మందిని ఉదయం 11.30 గంటల సమయంలో యశోద ఆస్పత్రికి తరలించారు. క్లీనర్ రమేష్(20), విద్యార్థి వ ంశీ(7) చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 20 మంది చిన్నారులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఏడుగురు విద్యార్థులకు వెంటిలేటర్ అమర్చారు.


 


కాళ్లు, చేతులు విరిగిపోయి, తలకు బలమైన గాయాలై, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న  క్షతగాత్రులందరినీ వెంటనే ఏసీయూ, ఏఎన్‌సీయూ విభాగాలకు తరలించి చికిత్సలు అందించారు. అందరికీ ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, సీటీస్కాన్, రక్త, మూత్ర వంటి వైద్య పరీక్షలు చేశారు. ఇప్పటికే ఒకరికి సర్జరీ కూడా చేసినట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య మీడియాతో చెప్పారు.

 

 తీవ్ర విషమ స్థితిలో వీరే..

 

 శరత్(6): తల, ఛాతిలో బలమైన గాయాలు. ఆస్పత్రి ఆరో అంతస్తులోని సీవీయూ విభాగానికి తరలించారు. శ్వాసకూడా తీసుకోలేకపోతున్నాడు. వెంటిలేటర్ అమర్చి, చికిత్స అందిస్తున్నారు.

 అరుణ్‌గౌడ్(7): ఛాతి, తొడకింది భాగం, కనురెప్పపై బలమైన గాయాలు. సీవీయూ విభాగంలో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.

 వైష్ణవి(11): తల, ఇతర భాగాల్లో బలమైన గాయాలు. ఏసీయూ విభాగానికి తరలించి, వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నారు.

 తరుణ్(7): తల, కుడిచెవిపై బలమైన గాయాలు. స్కిన్ అంతా ఊడిపోయి కార్టిలేజ్ బయటకు తేలింది. ఏఎన్‌సీయూ విభాగానికి తరలించి వెంటిలేటర్ ద్వారా కృత్రిమశ్వాస అందిస్తున్నారు.

 విషమస్థితిలో...

 రుచితగౌడ్(8): తల, నుదురు, ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాలు. బ్రెయిన్‌ను సీటీస్కాన్ చేయగా నార్మల్ అని వచ్చింది. సీవీయూ విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 నజియాఫాతిమా(9): పెదవి లోపల, గవద భాగంలో బలమైన గాయాలు. ఏసీయూలో చికిత్స అందిస్తున్నారు.

 శ్రావణి(6): తలకు బలమైన గాయం. కుడి తొడపై భాగంలో రెండు చోట్ల ఎముక విరిగింది. ఏసీయూ విభాగంలో చికిత్స జరుగుతోంది.

 శిరీష(8): కుడి దవడ ఎముక, కింది దవడ ఎముకలు విరిగిపోయాయి. తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఏసీయూ విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

 దర్శన్(6): ఊపిరితిత్తుల కుడిభాగంలో బలమైన గాయాలు. శ్వాస సరిగా తీసుకోలేకపోతుండడంతో వెంటిలేటర్ అమర్చారు.

 ప్రశాంత్(6): పుర్రే ఎముకపై చర్మం పూర్తిగా ఊడిపోయింది. వెంటిలేటర్ అమర్చారు. చిన్నారి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.

 నితుషా(7): శరీరమంతా గాయాలు. అధిక రక్తస్రావంతో బాధపడుతోంది. వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నారు.

 నిలకడగా ఆరోగ్యం...

 సాయిరాం(4): ముఖం, తలకు గాయాలు. బ్రెయిన్‌ను సీటీస్కాన్ తీయగా రిపోర్‌‌ట నార్మల్ అని వచ్చింది.

 సందీప్(5): ముఖం, నుదురు, తొడ కింద భాగంతో పాటు అనేక చోట్ల గాయాలు.

 సాత్విక(6): కంటి ఎముక, కనుబొమ్మలు, గదవ కుడిభాగంలో గాయాలు.

 హరీష్(7): గదవ, కుడి తొడభాగంలో బలమైన గాయాలు.

 మహిపాల్‌రెడ్డి(4): కుడి భుజం, ముఖం, వెన్నుముఖ, తదితర భాగాల్లో గాయాలు.

 అభినందు(9): ఎడమ మోకాలు, కుడిపాదం పూర్తిగా దెబ్బతింది.

 సబ్దావన్‌దాస్(3):  తొడ ఎముక విరిగింది.

 కరుణాకర్(9): కుడి మోచేయి దెబ్బతింది. శివకుమార్(5): సెరబ్రల్ ఎడిమా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top