వాట్సాప్లోకి త్వరలో ఆ ఫీచర్ వచ్చేస్తోంది!

వాట్సాప్లోకి త్వరలో ఆ ఫీచర్ వచ్చేస్తోంది!

మెసేజింగ్ లో ఇప్పటికే వాట్సాప్ తనదైన ముద్ర వేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లతో వినియోగదార్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఫీచర్ ఫీచర్ తో వినియోగదారులను అలరించేందుకు వచ్చేస్తోంది. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోతుండటంతో యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేలా తమ యూజర్లకు అవకాశం కల్పించాలని సిద్ధమవుతోంది. ఇప్పటికే వాట్సాప్ దేశీయ బ్యాంకులు, ఇతర ఇన్ స్టిట్యూషన్లతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది.

 

యూపీఐ ద్వారా తమ మొబైల్ ప్లాట్ ఫామ్ పైననే రెండు బ్యాంకుల మధ్య ఇన్ స్టాంట్ ఫండ్ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. ఈ సేవల ప్రారంభంలో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా వాట్సాప్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎన్పీసీఐ, ఇతర కొన్ని బ్యాంకులతో చర్చిస్తోందని, బ్యాంకులు, ఎన్పీసీఐతో తమ సిస్టమ్ ఎలా ఇంటిగ్రేట్ అవాలో నిర్ణయిస్తుందని ఓ సీనియర్ ఎస్బీఐ అధికారి చెప్పారు.

 

యూపీఐను ఎన్పీసీఐ రన్ చేస్తోంది. ఈ యూపీఐ ఆధారంగా పనిచేసే 'పీర్-టు-పీర్(పర్సన్ నుంచి పర్సన్)' పేమెంట్ సేవలను వాట్సాప్ లో యూజర్లు వినియోగించుకోవచ్చు. నోట్ల రద్దు అనంతరం దేశాన్ని క్యాష్ లెస్ సొసైటీగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాష్ లెస్ సొసైటీలో తాము భాగస్వామ్యం కావాలని సోషల్ మీడియా దిగ్గజాలు నిర్ణయించాయి. ఈ మేరకు హైక్ మొన్ననే పేమెంట్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

వాట్సాప్ కంటే ముందస్తుగా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టి, పేమెంట్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన తొలి మెసేజింగ్ యాప్ గా పేరు తెచ్చుకుంది. అయితే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ ను అమలు చేయాలంటే కొన్ని సెక్యురిటీ ప్రొటోకాల్స్ అవసరం పడతాయని, ఒకవేళ దీనికి ఆధార్ వాడాలనుకుంటే, అప్పుడు తాము బయోమెట్రిక్ అథన్టికేషన్ ఎనేబుల్ చేస్తామని మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు.  ప్రస్తుతం వాట్సాప్ కు భారత్ లో 20 కోట్ల మంది యూజర్లున్నారు. వారిని మరింత పెంచుకునేందుకు వాట్సాప్ కృషిచేస్తోంది. 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top