టైజెన్‌ స్మార్ట్‌ఫోన్లు ఇక గ్లోబల్‌గా

టైజెన్‌ స్మార్ట్‌ఫోన్లు ఇక గ్లోబల్‌గా


శాన్‌ ఫ్రాన్సిస్కో: ప్రముఖ మొబైల్‌సంస్థ, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం  శాంసంగ్‌   టైజెన్ ఓఎస్‌తో  పనిచేసే  స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్‌గా ప్రవేశపెట్టనుంది. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని 5వ టైజెన్ డెవలపర్  కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా ఈ ప్రణాళికలను  శాంసంగ్‌  వెల్లడించింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా  టైజెన్ 4.0 ను  ఆవిష్కరించనున్నట్టు తెలిపింది.  టైజెన్‌తో పనిచేసే జెడ్‌ ఫోన్లు తమ దేశంలో  బాగా ఉన్నాయని ఈ నేపథ్యంలో మరిన్ని దేశాలలో ఈ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు  చెప్పింది.   అలాగే ఆర్టిక్‌ 053 మాడ్యూల్, తేలికపాటి ఐఓటీ చిప్సెట్ లను కూడా లాంచ్‌ చేయనున్నట్టు చెప్పింది.   ఈ ఆర్టిక్‌ 053 మాడ్యూల్ లో  ఇంటిగ్రేటెడ్‌ రియల్‌టైం  ప్రాసెసర్‌ 320 ఎంహెచ్‌జెడ్‌, ఏఆర్‌ఎం కోర్‌టెక్స్‌ 4 కోర్‌, 1.4 ఎంబీ ర్యామ్ 8 ఎంపీ ఫ్లాష్ తో తీసుకురానున్నట్టు తెలిపింది.   



టైజెన్‌ 4.0 ప్లాట్‌ఫాంలో  ఐవోటీ డెవలపర్స్‌ కోసం  స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లతోపాటు, థర్మోస్టాట్లు, స్కేల్స్‌,బల్బ్స్‌  ఇతర  ఉత్పత్తులను అభివృద్ధి కొరకు కీలకమార్పులు చేసినట్టు తెలిపింది.  ఆ మేరకు ఆయా దేశాల్లో  టైజెన్‌ విస్తరణకు  ఇతర కంపెనీలతోభాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది. చైనాలో బ్రాండ్‌ లింక్‌,  కొరియాలో స్మార్ట్ హోమ్ పరికర తయారీదారు కొమాక్స్‌, అమెరికాలోసర్వీస్ ప్రొవైడర్ గ్లిమ్స్‌ తో ఒప్పందంచేసుకున్నట్టు  శాంసంగ్ ప్రకటించింది.



 లాంచింగ్‌ నుంచి దాదాపు అన్ని శాంసంగ్‌ ఉత్పత్తులకు  టైజెన్‌ ఓఎస్‌గాఉందని  లైనక్స్‌ ఆధారిత  ఆపరేటింగ్‌ సిస్టంతో ప్రపంచంలో విజయంసాధించినట్టు చెప్పారు.  తాజాగా ఇంటర్నెట్‌  ఆఫ్‌ ధింక్స్‌(ఐఓటీ) లోకి ఎంట్రీ ఇస్తున్నామని ,ఇది ఐవోటి  భవిష్యత్తు లో మరిన్ని అవకాశాలకు  దారి చూపుతుందని తాము భావిస్తున్నామని శాసంగ్ ఎలక్ట్రానిక్స్‌ విజువల్ డిస్ప్లే బిజినెస్  ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ,  టైజెన్ టెక్నికల్ స్టీరింగ్ గ్రూప్ చైర్ హ్యూగన్ లీ అన్నారు.

 



 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top