ఈ ఫోన్ కు ఇక రాంరాం.. తయారీ నిలిపివేత


చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ తన నూతన స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 5ను ఈ సమ్మర్ లోనే తీసుకురాబోతుంది. ఈ విషయంపై కంపెనీ ఇప్పటికే స్పష్టతనిచ్చేసింది. ఈ ఫోన్ పై క్లారిటీ ఇచ్చిన వన్ ప్లస్, మరో బ్యాడ్ న్యూస్ కూడా తన బ్లాగ్ లో పేర్కొంది. మార్కెట్లో విశేష ఆదరణ కలిగిన వన్ ప్లస్ 3టీ  స్మార్ట్ ఫోన్ల  ఉత్పత్తిని ఆపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకే వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ భారత్ లో అమ్మకానికి ఉంటుందని  కంపెనీ తెలిపింది. 64జీబీ, 128జీబీ వేరియంట్లలో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది. మార్కెట్లో ఉన్న వన్ ప్లస్3, వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్లకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ల సపోర్టును తీసుకొస్తుంటామని కంపెనీ చెప్పింది. కానీ ఎప్పడివరకూ ఈ సపోర్టు తీసుకొస్తుందో పేర్కొనలేదు.

 

బ్లాగ్ పోస్టులో కంపెనీ పేర్కొన్న వివరాలు..''స్టాక్ అయిపోయే లోపలే వన్ ప్లస్ 3టీ కొనుగోలు చేయడండి. కంపెనీ వేర్ హౌజ్ లో ఇంకా కొన్ని యూనిట్లు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇక ఈ ఫోన్లను తయారు చేయదలుచుకోలేదు '' అని స్పష్టంగా పేర్కొంది. వన్ ప్లస్ 3టీ  ఎక్కువగా విజయవంతమైన స్మార్ట్ ఫోన్లలో ఒకటి. ప్రపంచంలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో కూడా దీనికి మంచి ర్యాంక్ ఉంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన వన్ ప్లస్ 3టీ గన్ మెటల్ కలర్ ఆప్షన్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే లిస్టు చేయడం ఆపివేసింది.

 

అమెజాన్ ఇండియాలో వన్ ప్లస్ 3 ఫోన్ 1000 రూపాయల ధర తగ్గింపుతో రూ.26,999 వద్ద అందుబాటులో ఉంది. 64జీబీ వెర్షన్ లో కేవలం సాఫ్ట్ గోల్డ్ వెర్షన్ స్టాక్ మాత్రమే ఉంది. వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ కూడా 64జీబీ వెర్షన్ లో గన్ మెటల్ గ్రే, సాఫ్ట్ గోల్డ్ వెర్షన్లలోనే అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ కలర్ ఆప్షన్ ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్. 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top