నోకియా 8 భారత్‌లోకి ఎప్పుడు?

నోకియా 8 భారత్‌లోకి ఎప్పుడు?

నోకియా 8... ఎన్నో రూమర్లు, అంచనాల తర్వాత అధికారికంగా వినియోగదారుల ముందుకు వచ్చేసింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లండన్‌ వేదికగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. నోకియా 8 కేవలం నోకియా తొలి ఫ్లాగ్‌షిఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే కాక,  ఆండ్రాయిడ్‌తో రన్‌ అయ్యే ఫిన్నిస్‌ కంపెనీ నుంచి విడుదలైన తొలి హై-ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా. శాంసంగ్‌ గెలా​క్సీ ఎస్‌8, ఆపిల్‌ ఐఫోన్లకు పోటీగా దీన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో, మార్కెట్‌లోని లీడింగ్‌ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ దీనికి ప్రధాన ఆకర్షణ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8, ఐఫోన్లకు గట్టిపోటీ ఇచ్చే మాదిరే ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు కూడా 599 యూరోలు అంటే సుమారు 45వేల రూపాయలు.


 


అంతర్జాతీయంగా విడుదలైన ఈ ఫోన్‌ భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించనుందో మాత్రం ఆ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. కానీ సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ భారత్‌లోకి వచ్చేస్తుందని, అప్పటి నుంచే విక్రయాలు ప్రారంభమవుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ఈ ఫోన్‌ ధర 39,999గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలోనే హెచ్‌ఎండీ గ్లోబల్‌ ముచ్చటగా మూడు స్మార్ట్‌ఫోన్‌లు నోకియా 6, నోకియా 5, నోకియా 3 స్మార్ట్‌ఫోన్లను భారత్‌లోకి లాంచ్‌ చేసింది. నోకియా 5, నోకియా 3లు విక్రయానికి కూడా వచ్చాయి. ఆగస్టు 23 నుంచి నోకియా 6 కూడా ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియాలో అందుబాటులోకి వస్తుంది.


 


నోకియా 8 ఫీచర్స్‌


5.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే


1440 x 2560  రిజల్యూషన్‌


ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్‌


4 జీబి ర్యామ్‌


64 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌


256 జీబీ వరకు విస్తరణ మెమరీ


13 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా(4కే వీడియో)


13 మెగా పిక్సెల్  ఫ్రంట్  కెమెరా


 3090 ఎంఏహెచ్‌  బ్యాటరీ


 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top