Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం టెక్నాలజీకథ

ఈ నోకియా ఫోన్‌ ధర ఎంతో తెలిస్తే...

Others | Updated: July 07, 2017 19:15 (IST)



నోకియా ఫీచర్‌ ఫోన్‌ను తిరిగి లాంచ్‌​ చేసి  ఫోన్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌  చేసిన నోకియాసంస్థ ఇపుడు మరోసారి   తన ప్రత్యేకతను చాటుకుది.   'పుతిన్-ట్రంప్ సమ్మిట్'   స్పెషల్‌ ఎడిషన్‌ గా నోకియా 3310 (2017)ను లాంచ్‌ చేసింది.  ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ ఫోన్లలో ఒకటిగా  నిలిచిన ఈ  ఫీచర్ ఫోన్  ఇపుడు  అతి విలాసవంతమైన ఫోన్‌గా అవతరించింది. 

జీ20 అంతర్జాతీయ సమ్మిట్‌ సందర్భంగా  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశానికి గౌరవంగా దీన్ని రూపొందించింది.  రష్యన్ ఫోన్  కస్టమైజర్‌ కావియర్  నోకియా 3310 పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్ను సృష్టించింది. నోకియా 3310  'పుతిన్-ట్రంప్ సమ్మిట్' ఎడిషన్  ధర 2,468డాలర్ల (రూ. 1.6 లక్షలు)  ప్రీమియం ధరలో  కొనుగోలుకు  అందుబాటులో ఉంది.

ఇక ఈ స్పెషల్‌ నోకియా 3310  ఫీచర్ల విషయానికిస్తే  మిగితా ఫీచర్లన్నీ రెగ్యులర్‌ వేరియంట్‌ ఫీచర్లే ఉన్నాయి. అయితే  బంగారం పూత పూసిన పుతిన్‌-ట్రంప్‌ ఫోటో,   'బ్లాక్ వెల్వెట్'  విలాసవంతమైన కవరే దీని ప్రత్యేకత.   వీటి-23 గ్రేడ్  స్వచ్చమైన టైటానియంతో డమస్క్ స్టీల్ పూత తో ఈ కవర్‌ను ప్రత్యేకంగా రూపొందించారట.  ప్రపంచ నాయకులిద్దరూ ఒక దేశగా  చూస్తూ ఉన్న చిహ్నంలో  ట్రంప్, పుతిన్  రష్యా-అమెరికా సంబంధాల పురోగతి కాంక్షను సూచిస్తోందని  కావియార్   ప్రకటించింది. దీంతోపాటు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ల పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్లను అందిస్తున్నప్పటికీ, నోకియా 3310 (2017) తో పోలిస్తే వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాలి.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అద్దె గర్భానికి అన్యాయం

Sakshi Post

MLA Vishnu Kumar appeals to SIT

MLA Vishnu Kumar appeals to SIT

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC