క్యాష్‌ కావాలా? ఫేస్ బుక్ ఇస్తుందట!

క్యాష్‌ కావాలా? ఫేస్ బుక్ ఇస్తుందట! - Sakshi

చదువుకోవడానికి, వైద్యం లేదా ఇతర ఖర్చులకు నగదు కావాలా? అయితే మీ స్నేహితులను, ఎవరో తెలియని వారిని యూజర్లు ఫేస్ బుక్ లో అభ్యర్థించవచ్చు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ఫండ్ రైజింగ్ టూల్స్ ను విస్తరించింది. తన వ్యక్తిగత ఫండ్ రైజింగ్ ఫీచర్ కు ఇటీవలే కమ్యూనిటీ, స్పోర్ట్స్ కేటగిరీలను కంపెనీ యాడ్ చేసింది. స్నేహితుని కోసం కాని, వ్యక్తిగత అవసరాల కోసం కాని నగదు కావాలనుకునే వారు ఫేస్ బుక్ లో ఈ పర్సనల్ ఫండ్ రైజింగ్ ఫీచర్ ద్వారా కోరవచ్చు.  

 

చదువు, వైద్యం, పెట్ మెడికల్, విపత్తు సహాయం, వ్యక్తిగత అత్యవసరాలు, అంత్యక్రియలు, నష్టాలు, స్పోర్ట్స్, కమ్యూనిటీ వంటి కేటగిరీలను ఫండ్ రైజింగ్  కోసం ఫేస్ బుక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిధులు సేకరించే వారి వివరాలను యూజర్లు ఫేస్ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. మార్చిలో పర్సనల్ ఫండ్ రైజర్స్ టెస్టింగ్ ఫేస్ బుక్ ప్రారంభించింది. ఫేస్ బుక్ లో నిధులు సేకరించాలనుకునేవారు డెస్క్ టాప్ పై ఐతే,  facebook.com/fundraisers ను విజిట్ చేయాలి. అయితే దీనికి కొంత ఛార్జీలు చెల్లించాలి. మొత్తంలో 6.9 శాతంతో పాటు పేమెంట్ ప్రాసెసింగ్, వెట్టింగ్, సెక్యురిటీ కోసం 30 శాతం ఇవ్వాలి.  

 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top