ఈ యాప్ స్పెషల్ గా టెకీలకే..

ఈ యాప్ స్పెషల్ గా టెకీలకే..

బెంగళూరు :  ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతతో చాలామంది టెకీలు జాబ్స్ ఎలా  దొరుకుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలకే ఐటీ ఇండస్ట్రి తిరోగమనంలో ఉంది, జాబ్ పోతే, మరో  ఉద్యోగం ఎలా వెతుకోవాలా? అని సతమతమవుతున్నారు. టెకీల ఆందోళనను గమనించిన ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్, వారికి సాయం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొచ్చింది. 'స్టార్టప్ జాబ్స్' పేరిట  ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ వెంటనే టెక్నాలజీ ప్రొఫిషనల్స్ కు అలర్ట్ లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ లాంటి స్టార్టప్స్ లో ఎంపికచేసిన జాబ్ ఓపెనింగ్స్ ను ఈ యాప్ ఆఫర్ చేస్తోంది. అభ్యర్థులు ఈ యాప్ లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది.

 

దీంతో కంపెనీలు అభ్యర్థులు ప్రొఫైల్స్ ను చూసి, ఇంటర్వ్యూకు పిలువవచ్చు.  కంపెనీలు తమ ప్రొఫైల్స్ ను చూసిన తర్వాత వెంటనే స్టేటస్ అప్ డేట్లను కూడా అభ్యర్థులు పొందుతారు. బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-పోయిస్ సిస్టమ్స్ ఈ యాప్ ను అభివృద్ది చేసింది. లండన్ బిజినెస్ స్కూల్ అల్యూమినీ సచిన్ అగర్వాల్, బిశాన్ సింగ్ ఈ  స్టార్టప్ ను స్థాపించారు. హెచ్పీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ దీనికి కస్టమర్లు. ఈ క్లిష్టతరమైన మార్కెట్లో తమకు నెప్పే ఉద్యోగాలను వెతుకోవడంలో ఈ యాప్ టెకీలకు ప్రత్యామ్నాయ మార్గమని 10వేల స్టార్టప్ కార్యక్రమ అధినేత కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top