జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు!

జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు!

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో ఫోన్‌ మార్కెట్లోకి ఆవిష్కరణమైంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారుల ముందుకు కూడా వచ్చేస్తోంది. అయితే భారత్‌లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఒక యాప్‌ మాత్రం జియో ఫోన్‌లో పనిచేయదు. అదే వాట్సాప్‌. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, ఆ ఫోన్‌లో వాట్సాప్‌ లేనిదో ప్రస్తుతం యూజర్లు ఉండలేకపోతున్నారు. మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ సంపాదించుకున్న స్థానం అంత విశిష్టమైనది. కానీ ఈ యాప్‌ ప్రస్తుతం జియో ఫోన్‌లో పనిచేయదని తాజా రిపోర్టులలో తెలిసింది. ప్రీ-లోడెడ్‌గా జియో యాప్స్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ సపోర్టుతో వస్తున్న జియో ఫోన్‌, వాట్సాప్‌ను సపోర్టు చేయకపోవడం యూజర్లకు కొంత నిరాసక్తికి గురిచేస్తోంది. అయితే ఏదైనా అప్‌డేట్‌ ఉండొచ్చని లేదా వాట్సాప్‌ సపోర్టు చేయడం కోసం ఈ ఫీచర్‌ని తర్వాత దశలో ప్రవేశపెడతారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌కు 200 మిలియన్ పైగా యూజర్లున్నారు. 

 

గతవారంలో జరిగిన  వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్‌ అంబానీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు. ఆగస్ట్ 24 నుంచి ఈ ఫీచర్ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 1నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జియో ఫోన్ వినియోగదారులకు వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. డేటా ప్యాక్ రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్‌ డేటా అందుబాటులోకి ఉంటుంది.
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top