భారత్‌లోకి జియోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

భారత్‌లోకి జియోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి జియోనీ ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 26,999 రూపాయలకు జియోనీ 'ఏ1 ప్లస్‌' స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు జియోనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలున్నాయి. అదేవిధంగా ముందు వైపు 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇది కలిగి ఉంది. 4,550 ఎంఏహెచ్‌ బ్యాటరీ, హీలియో పీ25 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఎస్డీ కార్డుతో మెమరీ 256జీబీ వరకు విస్తరించుకునేలా కంపెనీ అవకాశం కల్పిస్తోంది. జూలై 26 నుంచి ఈ ఫోన్‌ భారత్‌లోని అన్ని రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.

 

హై-క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ డిమాండ్‌ పెంపుకు జియోనీ ఏ సిరీస్‌ ఎంతో సహకరిస్తుందని డైరెక్టర్‌-బిజినెస్‌ అలోక్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఆకట్టుకునే స్పెషిఫికేషన్లను, శక్తివంతమైన బ్యాటరీని, అడ్వాన్స్‌ ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్నట్టు తెలిపారు. తమ అతిపెద్ద బ్యాటరీ ఆల్ట్రాఫాస్ట్‌ ఛార్జింగ్‌ను ఆఫర్‌ చేస్తుందని, 300 సెకన్ల ఛార్జింగ్‌తో రెండు గంటల టాక్‌టైమ్‌ను ఇది అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఉంది. కేంద్రప్రభుత్వ ఆదేశాలనుసారం ఈ ఫోన్‌లో పానిక్‌ బటన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. మూడు సార్లు హోమ్‌ బటన్‌ను ప్రెస్‌ చేస్తే, ఇది యాక్టివేట్‌ అవుతోంది. 6 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5డీ ప్లస్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3, మ్యాక్స్‌ ఆడియో వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ దీనిలో మిగతా ఫీచర్లు. 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top