గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌‌: ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌

గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌‌: ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌ - Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఒక సేల్‌ అనంతరం మరో సేల్‌ నిర్వహిస్తూనే ఉంది. తాజాగా గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. ఈ సేల్‌ కింద గేమింగ్‌ హార్డ్‌వేర్‌, ల్యాప్‌టాప్స్‌, కెమెరాలు, ఆడియా యాక్ససరీస్‌పై బెస్ట్‌ డీల్స్‌ను, ఆఫర్లను ప్రకటించింది. జూలై 26 వరకు ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో గాడ్జెట్‌లు అతి తక్కువకు 999 రూపాయలకే లభ్యం కానున్నాయి. ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌తో రూపొందిన ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌ 26,990 రూపాయలకు, 41,990 రూపాయలకు లిస్టు చేసింది. బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు ఏసర్‌, ఐబాల్‌, లావా,మైక్రోమ్యాక్స్‌ ల్యాప్‌టాప్‌ ధరలు అతి తక్కువకు రూ.10,499 నుంచే ప్రారంభం కానున్నాయి. 


 


గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్‌ 20వేల రూపాయల వరకు ఉంది. అంతేకాక, టూ-ఇన్‌-వన్‌ ల్యాప్‌టాప్‌లను 25,990 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఏఐఓ డెస్క్‌టాప్‌ కలిగిన ఇంటెల్‌ ఇంటెల్‌, లెనోవో, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ ధరలు రూ.32,490 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ గ్రాండ్‌ గాడ్జెట్‌ సేల్‌లో కానూన్‌ ఈఓఎస్‌ 700డీ డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా రూ.39,499కి లభ్యంకానుంది. అదేవిధంగా ఈ కెమెరాతో పాటు రూ.6,999 విలువ గల మోటో హెడ్‌ఫోన్స్‌ ఉచితంగా లభించనున్నాయి. అదనంగా యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుదారులకు 5 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.


 


గోప్రో హిరో 5 స్పోర్ట్స్‌, యాక్షన్‌ కెమెరా కూడా రూ.36,100కే లభించనుంది. వీటితోపాటు  ఐపాడ్‌, టాబెట్లపై ఫ్లిప్‌కార్ట్‌ బెస్ట్ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఆపిల్‌, లెనోవో, శాంసంగ్‌, మైక్రోమ్యాక్స్‌, ఐబాల్‌ వంటి టాబ్లెట్లపై గ్రేట్‌ డిస్కౌంట్లను, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌ వంటి ఆడియో యాక్ససరీస్‌పై కూడా  ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించింది. 


 

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top