మరో చైనా కంపెనీ ఎంట్రీ, 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

మరో చైనా కంపెనీ ఎంట్రీ, 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

సాక్షి, న్యూఢిల్లీ : భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనీస్‌ కంపెనీల హవా అంతా ఇంతా కాదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఎక్కువగా భారత మార్కెట్‌పై గురిపెట్టి, కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా మరో చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఓడీఎం టాప్‌వైజ్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ భారత్‌లో మూడు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  ఆ స్మార్ట్‌ఫోన్లు.. కామియో సీ1, కామియో ఎస్‌1, కామియో పీ1. ఈ కంపెనీ తొలిసారి భారత మార్కెట్‌లో ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ల లాంచింగ్‌తోపాటు, భారత్‌లో తమ బ్రాండు అంబాసిడర్‌గా యామీ గౌతమిని నియమిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది.  

 

ఈ ఫోన్ల ధర, అందుబాటు వివరాలు...

కామియో సీ1 ధర 5,999 రూపాయలు. మెల్లో గోల్డ్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. కామియో ఎస్‌1 ధర 8,999 రూపాయలు. ఇది రాయల్‌ బ్లాక్‌, సన్‌రైజ్‌ గోల్డ్‌ రంగుల్లో మార్కెట్‌లో లభ్యం కానుంది. చివరిగా కామియో పీ1 దీని ధర 9,999 రూపాయలు. మెటల్‌ గ్రే, సన్‌రైజ్‌ గోల్డ్‌ రెండు రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. వచ్చే వారాల్లో అన్ని దిగ్గజ ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఇవి విక్రయానికి వస్తున్నాయి. వీటి లాంచింగ్‌ ఆఫర్లలో భాగంగా బైబ్యాక్‌ ఆఫర్లు, 30 రోజులు రీప్లేస్‌మెంట్‌ వారెంటీ, స్క్రీన్‌ డ్యామేజ్‌ వారెంటీ, మిగతావి కంపెనీ అందించనుంది. 

 

స్పెషిఫికేషన్లు...

కామియో సీ1 ఫీచర్లు...5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ మీడియా టెక్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌7.0 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు విస్తరణ మెమరీ, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ, వైఫై.

 

కామియో ఎస్‌ 1 ఫీచర్లు.. 5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌-కోర్‌ మీడియా టెక్‌ ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌7.0 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, డ్యూయల్‌ సిమ్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

 

కామియో పీ1 ఫీచర్లు.... 5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ మీడియా టెక్‌ ప్రాసెసర్‌, 3 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌7.0 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు విస్తరణ మెమరీ, డ్యూయల్‌ సిమ్‌, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌.

 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top