Alexa
YSR
‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం టెక్నాలజీకథ

రోజుకు 4జీబీ డేటా.. 90 రోజుల పాటు

Others | Updated: June 16, 2017 15:14 (IST)
రోజుకు 4జీబీ డేటా.. 90 రోజుల పాటు
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో టెలికాం రంగంలో తీవ్ర పోటీని నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పోటీ నేపథ్యంలో చౌక డేటా రేట్లతో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త 3జీ మొబైల్ డేటా ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ చౌక-444పేరుతో ఈ ప్రమోషనల్ ప్రీపెయిడ్ ప్యాక్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.444 రీఛార్జ్ తో రోజుకు 4జీబీ డేటాను 90 రోజుల పాటు ఇవ్వనుంది. అంతకముందు ప్రకటించిన ఎస్టీవీ 333 అకా ఏస్ ప్లాన్ కు మంచి స్పందన రావడంతో తాజాగా ఈ ఎస్టీవీ-444 ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది.
 
అన్ని సెగ్మెంట్లలోని తమ కస్టమర్లకు సరసమైన, సమర్థవంతమైన సర్వీసులు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు. ప్రస్తుత టెలికాం మార్కెట్లో ట్రెండ్ కు అనుగుణంగా తమ కస్టమర్లకు మంచి ధరలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత టెలికాం ఆపరేటర్లు అందించే రోజువారీ డేటాలో ఇదే అత్యధికం. ఈ స్కీమ్ కింద ఒక గిగాబిట్ 3జీబీ డేటా రూపాయి కంటే తక్కువకు దొరుకనుంది. బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థ కంపెనీలు రోజుకు 2జీబీ మొబైల్ బ్రాడ్ బ్యాండును అందిస్తున్నాయి. 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC