భారీ డిస్‌ప్లేతో ఐఫోన్‌ 8






ఐఫోన్‌ 8.. ఎంతోకాలం నుంచి ఆపిల్‌ ఊరిస్తున్న తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌. ఈ ఫోన్‌పై లీకేజీలు వస్తున్న అన్నీ ఇన్నీ కావు. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్‌ ఈ ఐఫోన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్‌లలో మున్నుపెన్నడూ లేని సరికొత్త ఫీచర్లతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తుందని ఇప్పటికే టెక్‌ వర్గాలు సిగ్నల్స్‌ ఇచ్చేశాయి. తాజాగా మరో లీకేజీ ఈ ఫోన్‌పై మరింత ఆసక్తిని రేపుతోంది. అది ఐఫోన్‌ 8 స్క్రీన్‌ సైజు. భారీ డిస్‌ప్లేతో ఇది ఆపిల్‌ అభిమానులను అలరించబోతుందట. ప్రస్తుతమున్న ఐఫోన్‌ 7 స్మార్ట్‌ఫోన్‌ 4.7 అంగుళాల డిస్‌ప్లే, 5.8 అంగుళాల డిస్‌ప్లేలకు 1.1 అంగుళాల మేర పైకి జంప్‌ చేస్తుందని ఆపిల్‌ నుంచే ఈ లీకేజీ వచ్చేసింది. కంపెనీ సొంత సాఫ్ట్‌వేర్‌ కూడా ఈ ఊహాగానాలకు ఆమోదం తెలుపుతోంది. 

 

ఐఓఎస్‌ డెవలపర్‌ థ్రోటన్‌-స్మిత్‌  తాజాగా చేసిన ట్వీట్‌లో కచ్చితమైన ఐఫోన్‌ సైజు వివరాలను రివీల్‌ చేశారు. అయితే ఇది కేవలం స్క్రీన్‌ పాయింట్లేనని, పిక్సెల్స్‌ కావని కొందరంటున్నారు. ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ ఐఫోన్‌పై స్టేటస్‌ బార్‌ వాడే మెట్రిక్స్‌గా ఆయన వీటిని పేర్కొన్నారు. అయితే స్మిత్‌ లీకేజీలను కొట్టిపారేయడానికి లేదు. ఇతను ఐఓఎస్‌ డెవలపర్‌గా ఉన్నారు. దీంతో తొలిసారి ఐఫోన్‌8 గురించి అధికారికంగా ఆపిల్‌ నుంచి వచ్చిన ప్రకటన ఇదేనని టెక్‌ వర్గాలంటున్నాయి. ఐఫోన్‌ 7 కంటే మాత్రం ఇది కచ్చితంగా చాలా పెద్ద డిస్‌ప్లేనే కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ ఐఫోన్‌ ప్లస్‌ మోడల్‌ను విడుదల చేస్తే, దాని డిస్‌ప్లే 7 అంగుళాలకు దగ్గర్లో ఉంటుందని కూడా సమాచారం. కాగ, ఐఫోన్‌ తాజాగా తీసుకురాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లో వర్చ్యువల్‌ హోమ్‌ బటన్‌ ఉంటుంది. 

 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top