'ఆండ్రాయిడ్ పే' భారత్ లోకి వచ్చేస్తోంది...

'ఆండ్రాయిడ్ పే' భారత్ లోకి వచ్చేస్తోంది... - Sakshi

కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో క్యాష్ లెస్ డిజిటల్ పేమెంట్ల ప్రాముఖ్యత భారత్ లో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.. అప్పటివరకు భారత్ లో డిజిటల్ పేమెంట్లపై దృష్టిపెట్టని దిగ్గజ కంపెనీలన్నీ ప్రస్తుతం వీటిపై ఫోకస్ చేశాయి. ఇటీవలే స్మార్ట్ ఫోన్ల రారాజు శాంసంగ్ ఇండియాలో  'శాంసంగ్ పే'  ఫ్లాట్ ఫామ్ ను లాంచ్ చేయగా.. ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ సైతం 'ఆండ్రాయిడ్ పే'  ఫ్లాట్ ఫామ్ ను ఈ ఏడాదిలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ తో తన ఆండ్రాయిడ్ పే డిజిటల్ వాలెట్ టెస్టింగ్ ను భారత్ లో గూగుల్ ప్రారంభించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

 

అమెరికా, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, పోలాండ్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, జపాన్, బెల్జియంలలో ఇప్పటికే ఆండ్రాయిడ్ పే అందుబాటులో ఉండగా.. ఇటీవలే రష్యాలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆండ్రాయిడ్ పే సర్వీసులను గూగుల్ 2015లో విడుదల చేసింది. భారత్ లో ఆండ్రాయిడ్ పే సర్వీసుల లాంచింగ్ రిపోర్టుపై స్పందించిన కంపెనీ అధికార ప్రతినిధి యూజర్లు తమ మొబైల్ డివైజ్ ల ద్వారానే సులభతరంగా పేమెంట్లు జరుపుకునేందుకు మార్గాలను తాము అన్వేసిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆండ్రాయిడ్ పే సర్వీసులను కొన్ని దేశాల్లో అందిస్తున్నామని,  తమ సామర్థ్యాన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు. 200 మిలియన్ యూజర్లు కలిగిఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా యూపీఐ పేమెంట్ సొల్యుషన్ తో ఇంటిగ్రేట్ అయి, యూజర్లు తమ కాంటాక్ట్స్ కు సులభతరంగా నగదు పంపించుకునే మార్గాలను అన్వేసిస్తోంది.   
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top