స'పోర్టు' ఇస్తారా..

స'పోర్టు' ఇస్తారా.. - Sakshi

రామాయపట్నం పోర్టు సాధన కోసం పోరుబాట 

నేడు వైఎస్సార్ సీపీ ‘పోర్టు సాధన యాత్ర’ 

అందరూ కలసి వస్తేనే పోర్టు సాధ్యం

 

ఉలవపాడు: రామాయపట్నం పోర్టు సాధించాలి.. ఇది అన్ని పార్టీల నాయకుల గుండెల్లో ఉంది. కానీ అందరూ కలిసి ప్రయత్నించకపోవడం వల్లే పోర్టు రాలేదు. రామాయపట్నంలో పోర్టు నిర్మించినా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే రామాయపట్నం నుంచి మండల కేంద్రమైన ఉలవపాడుకు 19 కి.మీ ఉండగా..అంతే దూరంలో నెల్లూరు జిల్లా కావలి వస్తుంది. అందుకే ఎక్కువ శాతం అభివృద్ధి కావలిలో ఉంటుందని ఆ ప్రాంత నాయకులు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం రామాయపట్నం పోర్టు సాధన పాదయూత్ర చేపట్టారు. గతంలో సీపీఐ నాయకుడు నారాయణ కూడా వచ్చి పోర్టు కోసం పోరాటం చేస్తామని ప్రకటించి వెళ్లారు. వీరితో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాదయూత్రతోనైనా అందరూ ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది.  

 

అనువైన ప్రాంతం అని నివేదికలు ఇచ్చినా...

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అనువైన ప్రాంతం అని గతంలోనే కేంద్రం నుంచి వచ్చిన కలైమణి బృందం తేల్చింది. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూముల వివరాలు కూడా తెలియజేశారు. మొత్తం సుమారు 5,200 ఎకరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అప్పట్లో ఢిల్లీలో ఉన్న లాబీయింగ్ కారణంగా చిత్తూరు కు చెందిన నాయకుడు దుగరాజపట్నంకు పోర్టు తరలించారు. అది అనువైన ప్రాంతం కాకపోయినా ఇప్పుడు మారిన ప్రభుత్వం కూడా అదే పాత పాట పాడుతోంది. 

 

రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్  సీపీ పోరాటం

రామాయపట్నం పోర్టు ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజంతో పాటు పొగాకు, పత్తి తదితర ఉత్పత్తులు సైతం తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు జరుగుతారుు. రామాయపట్నం పోర్టు అన్నింటికీ అనుకూలం. రామాయపట్నం పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీలు సైతం చెప్పారుు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం రామాయపట్నం పోర్టు కోసం ఇటీవల పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించాం. ప్రభుత్వం దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని నిర్ణయించినందున ప్రైవేట్ పోర్టు మోడ్‌లో నిర్మించే ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కసరత్తు చేయాలని ప్రధాని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా ఇంత వరకు చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించడం, వాటిని అమ్ముకోవడంతోనే సరిపోతోంది.  రామాయపట్నం పోర్టు నిర్మాణమైతే కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని కావలి, ఉదయగిరి ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతారుు. కృష్ణపట్నం పోర్టు ఆనుకొని మరో పోర్టు ను నిర్మించటం సరైంది కాదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కొందరు నేతల వ్యక్తిగత స్వార్థంతో దుగరాజపట్నం పోర్టు నిర్మాణం కోసం పట్టుపడుతున్నారు. రామాయపట్నం పోర్టు కోసం రాజకీయాలకతీతంగా జిల్లాలోని అన్ని పార్టీల నేతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. వైఎస్సార్‌సీపీ పోర్టు కోసం ఉద్యమిస్తోంది. ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలి.  - ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి

 

రామాయపట్నం పోర్టు నిర్మించాల్సిందే...

కేంద్ర ప్రభుత్వం జిల్లా పరిధిలోని రామాయపట్నం పోర్టు నిర్మించాలి. ప్రకాశం జిల్లా పరిధిలో 102 కి.మీ. మేర సముద్రతీర ప్రాంతం ఉంది. పోర్టుకు రామాయపట్నమే అనుకూలం. పోర్టు నిర్మిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తారుు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీని వల్ల వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తారుు. రామాయపట్నం పోర్టు ఎగుమతులకు అనుకూలం. ఇక్కడ పోర్టు నిర్మించడం వల్ల ప్రకాశం జిల్లాతో పాటు అటు నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతారుు. ఎగుమతులు మరింతగా పెరుగుతారుు. తీరప్రాంతం సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తుంది. రామాయపట్నం పోర్టు కరువు ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుంది. దుగరాజపట్నం పోర్టుకు అనుకూలం కాదు. ఇప్పటికే అక్కడ పోర్టును షార్‌తో పాటు పర్యావరణ అధికారులు సైతం వ్యతిరేకిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు ఇప్పటికే ఉన్నందున దుగరాజపట్నం పోర్టు నిర్మాణం సరైంది కాదు. కొందరు స్వార్థం కోసమే దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సిద్ధపడాలి.  రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చే స్తోంది. ఈ ఉద్యమంలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి.

- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top