హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే - Sakshi


* ఘనంగా జగనన్న పుట్టిన రోజు వేడుకలు

* సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నేతలు


సాక్షి, చెన్నై : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తమ అభిమానాన్ని చాటుకునే రీతిలో ఆయ న పుట్టిన రోజు వేడుకలు చెన్నైలో ఆదివారం ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాలతో తమ అధినేత బర్త్‌డేను పార్టీ నాయకులు, అభిమానులు సంతోషంగా జరిపారు.

 

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందనంత దూరాలకు మహానేత వెళ్లినా, ఆయన వారుసుడికి అండగా  తామున్నామని అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. అభిమానంతో ఓ వైపు, పార్టీ పరంగా మరో వైపు తమ మద్దతును అందిస్తూనే ఉన్నారు. వైఎస్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఆయనన్ను స్మరించుకుం టూ, మరో వైపు పార్టీ పరంగా సేవ కార్యక్రమాల్ని సాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం వైఎస్సార్ సీపీ అధినేత, రాజన్న వారసుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టిన రోజు జరుపుకున్నారు.

 

ఘనంగా వేడుకలు :

తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్‌ల నేతృత్వంలో వ్యాసార్పాడిలో వేడుకలు ఘనం గా జరిగాయి. అక్కడి డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో జగనన్న పుట్టిన రోజు పండుగను నిర్వహించారు. ఉదయాన్నే వృద్ధాశ్రమంలో తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫాదర్ పాప్ రాజ్, స్టిసర్స్ జనీఫర్, సిస్టర్ సెల్విల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజ యవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం వృద్ధులకు పసందైన అల్పాహారం అందించారు. స్వ యంగా వైఎస్సార్ సీపీ నాయకులు వృద్ధులకు అల్పాహారాన్ని వడ్డించారు.

 

పిల్లల నడుమ

వృద్ధాశ్రమంలో సేవల అనంతరం పిల్లల సమక్షంలో జగన్ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. వైఎస్సా ర్, జగన్ చిత్ర పటాల్ని చేత బట్టి నినాదాలతో హోరెత్తించారు. ముందుగానే సిద్ధం చేసిన భారీ కేక్‌ను చిన్నారి చేత కట్ చేయించారు. పిల్లలందరికీ కేక్, చాక్లెట్, స్వీట్లు పంచి పెట్టారు. బ్రదర్ పీటర్ నేతృత్వంలో జగన్ క్షేమాన్ని, మరింత ఎదుగుదలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనచేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలందరూ కరతాళ ధ్వనులు మార్మోగించారు. ఈ వేడుకల్లో వైఎస్సా ర్ సీపీ నేతలు గొల్లపల్లి గురుమూర్తి, సురేష్ కుమార్, ఎస్.దావిద్, పాండియన్, బాలాజీ, ఎస్ శరవణన్, చోడవరం ప్రసాద్ సింగ్, ఎస్ సతీష్,  ఎస్ మధు, నాయుడు, వై మహేష్, బాలు, భాస్కర్, పెరంబూరు కుమార్, వ్యాసై ఏసు, పెరంబూరు వి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

 

ఏకైక నేత :


అనంతరంవైఎస్సార్ సీపీ నేతలు శరవణన్, జకీర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. తండ్రి ఆశయాల సాధనే లక్ష్యంగా కంకణ బద్దుడైన ఆయన మరింత ఉన్నతికి ఎదగడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గొల్లపల్లి గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ కుటుంబం అంటే తమకు ఎంతో అభిమానం అని పేర్కొన్నారు. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించినా, భవిష్యత్తుల్లో మరింత ఉన్నత స్థితికి చేరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సీఎం కావాలన్నదే తన లాంటి వారందరి ఆకాంక్ష అన్నారు.  తప్పకుండా తదుపరి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరూ గెలవడంతోపాటుగా సీఎం కుర్చీని జగన్ మోహన్‌రెడ్డి  అధిరోహించడం ఖాయం అని పేర్కొన్నారు.

 

ఆదంబాక్కంలో అభిమానం:

నంగనల్లూరు, ఆదంబాక్కం జీవన్ నగర్‌లో వైఎస్సార్ సీపీ ఐటీ, విద్యార్థి విభాగం నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉదవుం ఉల్లంగల్ ఇల్లంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పిల్లలతో కలసి ప్రత్యేక ప్రార్థన చేశారు. కేక్ కట్ చేశారు. మధ్యాహ్నం పిల్లలకు, ఆశ్రమంలోని వారికి అన్నదానం చేశారు. వారందరితో కలసి సహ పంక్తి భోజనం చేశారు. వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం సభ్యుడు శ్రీనివాస రెడ్డి, నాయకులు రామకృష్ణ, వినోద్, నరేంద్ర రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు సాయినాథ్, రామిరెడ్డి, జగన్, కోటి రెడ్డి తదితరులు పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించి, జగనన్న మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు.

 

పూజలు :

జగన్ మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వడపళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శాలిగ్రామం నాయకులు ఎం మోహన్‌రెడ్డి, నిరీష్ కుమార్, మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయాన్నే జగన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాదాలు పంచి పెట్టారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top