కోరిక తీర్చలేదని ప్రియురాలిని హతమార్చాడు

కోరిక తీర్చలేదని ప్రియురాలిని హతమార్చాడు - Sakshi


తిరువళ్లూరు: కోరిక తీర్చలేదన్న కోపంతో ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేశాడు. యువకుడిని పెనాలూరు పేట పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ  సంఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమారై చాముండేశ్వరి(19). ఈమె మనవాలనగర్‌లోని లోకిదాస్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. సోమవారం రాత్రి డ్యూటీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇంటి సమీపంలోని చాముండేశ్వరి ముళ్లపొదల్లోకి వెళ్లింది.

 

 ఆమె ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుప్పన్ సమీప ప్రాంతాల్లో గాలించడం ప్రారంభించారు. ముళ్లపొదల్లో చాముండేశ్వరి హత్యకు గురైనట్టు గుర్తించిన గ్రామస్తులు, పెనాలూరు పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువతి మృతదేహన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు గ్రామస్తులు నిరాకరించారు. యువతి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, నిందితుడిని పట్టుకోవడానికి డాగ్‌స్వాడ్‌ను రప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. అనంతరం మృతదేహన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు.

 

 ;ప్రియుడి అరెస్ట్: ఈ హత్య కేసులో అసలైన నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మొదట చాముండేశ్వరి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరిగా చాముండేశ్వరి మాట్లాడిన నెంబర్లపై ఆరా తీశారు.  పోలీసుల విచారణలో చాముండేశ్వరి అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో గంటల తరబడి మాట్లాడడంతో పాటు చివరి కాల్ యువకుడితో మాట్లాడినట్టు నిర్ధారించారు. దీంతో రాజ్‌కుమార్ ను నిందితుడిగా గుర్తించి గాలింపు చర్యలు చేట్టారు. ఊత్తుకోట వద్ద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

 

 పోలీసుల విచారణలో చాముండేశ్వరి, రాజ్‌కుమార్ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతంలో ఉన్న మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్‌కుమార్ ను దూరంగా ఉంచినట్టు తెలిపాడు. చివరి సారిగా మాట్లాడాలని పిలిపించిన రాజ్‌కుమార్, తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్టు తెలిసింది. ఇందుకు చాముండేశ్వరి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన రాజ్‌కుమార్ బండరాయిని తలపై మోది హత్య చేసినట్టు విచారణలో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top