ఇండియా ఆర్ట్ ఫెయిర్ ఏడో ఎడిషన్ ప్రారంభం


న్యూఢిల్లీ : ఇండియా ఆర్ట్ ఫెయిర్ ఏడో ఎడిషన్ గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ వరకూ నిర్వహించతలపెట్టిన ఈ ప్రదర్శనలో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అనేకమంది కళాకారులు, క్యూరేటర్లు, గ్యాలరీ యజమానులు, మ్యూజియం సంచాలకులు, వివిధ రకాల వస్తువుల సేకర్తలతోపాటు క ళా ప్రేమికులు కూడా పాలుపంచుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 85 గ్యాలరీలు, 3,500 కళాప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.

 

  ఈ ప్రదర్శనకు కళా దర్శకుడిగా గిరీష్ సహానే నియమితులయ్యారు. ఈ ప్రదర్శనలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల వక్తల్లో ఒకరిగా జాతీయ మ్యూజియం డెరైక్టర్ జనరల్ వేణువాసుదేవన్ ఎంపికయ్యయారు. ఆయనతోపాటు సంతోష్, జితీష్ కల్లత్‌తోసహా మొత్తం 44 మంది వక్తలు ఇందులో పాలుపంచుకుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన కళాకారుడు డానియల్ బురేన్ తన కళాచాతుర్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇంకా మనదేశానికి చెందిన చిత్రాగణేశ్, ధుర్వి ఆచార్య తదితరులు కూడా ఇందులో పాలుపంచుకోనున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top