మంచి ధర వస్తే.. ఎవరైనా నీలా ఏడుస్తారా?

మంచి ధర వస్తే.. ఎవరైనా నీలా ఏడుస్తారా? - Sakshi

రైతుల భూములకు నిజంగా కోటి రూపాయల ధర వస్తే సంతోషించాలి గానీ.. ఎవరైనా నీలా ఏడుస్తారా చంద్రబాబూ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బందరుపోర్టు బాధితులతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా బుద్దాలవారిపాలెం వెళ్లిన ఆయన.. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

 

  • పోర్టుకు వ్యతిరేకం అని ఎవరూ చెప్పడం లేదు. 

  • 2012లో పోర్టు కోసం 5200 ఎకరాలు సేకరిస్తామని జీవో జారీచేశారు.

  • అదే కాస్తోకూస్తో ఎక్కువ, అన్ని ఎందుకని అప్పట్లో చంద్రబాబు మాట్లాడారు

  • రైతులు ఆ మేరకు ఇస్తామని చెబుతున్నా, ఇప్పుడు ఇదే చంద్రబాబు 30వేల ఎకరాలకు ఎగనామం పెడుతున్నారు

  • 5200 ఎకరాలు కాస్తా 30వేల ఎకరాలు చేశారు. ఇప్పుడు అదికూడా తీసేసి 1.05 లక్షల ఎకరాలు కావాలట, దాన్ని ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటారట

  • రైతులంటే చంద్రబాబుకు ఎంత చులకనో దీన్నిబట్టే తెలుస్తోంది. 

  • రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలని, వాళ్ల కడుపుల మీద కాళ్లతో తంతున్నారు

  • చివరకు రైతులకు పంటలు పండించుకోడానికి కాల్వ నీళ్లు కూడా రెండేళ్ల నుంచి ఇవ్వడం లేదు

  • బ్యాంకుల నుంచి పంట రుణాలు కూడా ఇవ్వడం మానేశారు.

  • పొరపాటున ఏదైనా అవసరం ఉండి భూములు అమ్ముకుందామనుకుంటే.. అది కూడా వీలు లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆపేశారు

  • రైతులను ఇంత దారుణంగా ఇక్కడ వేధిస్తున్నారు

  • 5వేల ఎకరాలతో పోవాల్సింది ఇప్పుడు ఏకంగా లక్షా ఐదువేల ఎకరాలు తీసుకుపోతున్నారు.. ఇది ధర్మమేనా?

  • పోనీ దానికి ఏమిస్తున్నారని చూస్తే.. చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదు

  • మన భూములు లాక్కుంటారట, అందులో మనకు పావలా భాగం ఇస్తారట

  • భూమి మనది, ఎకరానికి వెయ్యి, 1200 గజాల స్థలం ఇస్తామని చెబుతున్నారు

  • అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావని ప్రశ్నిస్తున్నా

  • ఎవరైనా భూములు కొనుక్కోవాలంటే ఇంత ఇస్తాం, భూమి అమ్ముతారా అని అడుగుతారు

  • భూములు మీకు ఇష్టం లేకపోయినా లాక్కుంటారట.. అందులోంచి వెయ్యి గజాలు భిక్ష వేసినట్లు వేస్తారట

  • దానికోసం మీరు కేరింతలు కొట్టాలట..

  • రెండు పంటలు పండే వరిభూమి అయితే ఏడాదికి 30 వేల చొప్పున పదేళ్లు ఇస్తారట. అంటే మూడు లక్షలు

  • ఇదే రకమైన మోసం రాజధానిలో చేశాడు. ఇప్పటికి రెండున్నరేళ్లయింది. అక్కడ ఒక ఇటుక కట్టలేదు

  • ఏం చూసినా తాత్కాలికం అంటారు. చదరపు అడుగుకు 1500 రూపాయలు కడితే ఫ్లాట్ లోకి వెళ్లచ్చు

  • అదే చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు 6000 రూపాయలు పెడుతూ, లంచాలు తీసుకుంటున్నారు. 

  • ఒక్కటే చెబుతున్నా.. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు

  • ఈ ప్రభుత్వానికి మూడేళ్లు అయిపోయింది, మిగిలింది రెండేళ్లే

  • దేవుడు దయదలిస్తే వచ్చే సంవత్సరమే ఎన్నికలు రావచ్చు

  • రాకపోయినా.. ఇక ఆయన పాలన మిగిలింది రెండేళ్లే

  • అందరం కలిసికట్టుగా రెండేళ్లు మన భూములు కాపాడుకుందాం, తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే

  • 5000 ఎకరాల కన్నా ఒక్కటంటే ఒక్క ఎకరా కూడా తీసుకునే పరిస్థితి ఉండదు

  • అంతే తీసుకున్నా.. అందులో బ్రహ్మాండమైన పోర్టు కట్టవచ్చు

  • 240 మిలియన్ టన్నులకు పోర్టు సామర్థ్యాన్ని తీసుకెళ్లచ్చు

  • రైతులంతా సంతోషంగా ఆ భూములు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా

  • నిజంగా అలా ఇవ్వాలంటే.. ఎకరా 30 లక్షలో 50 లక్షలో ఇస్తే ఏం సొమ్ము పోతుంది?

  • అలా ఇచ్చే ధైర్యం, దమ్ము ఉంటేనే పాలన సాగించాలి

  • రైతులందరికీ ఒక్కసారి పోర్టు కట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే భూమి ఎకరా కోటి రూపాయలు చెబుతారని, అప్పుడు తీసుకోవడం సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు

  • నిజంగా రైతుల భూములు అంత ధర పలికితే సంతోషపడాలి గానీ, నీలా ఎవరైనా ఏడుస్తారా?

  • చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో పారేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

  • రైతులందరూ సంతోషంగా ఉన్నారని, భూములు ఇవ్వడానికి తన వద్దకు పరిగెడుతున్నారని ఆయన ఊదరగొడుతూ అబద్ధాలు చెబుతున్నారు

  • ఇంతకుముందు చదువుల కోసం ఏ పేదవాడూ అప్పుల పాలు కాకూడదని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవారు

  • చంద్రబాబు ఇంతకుముందు తనకు బీసీల మీద పెద్ద ప్రేమ అనేవారు, ఇస్త్రీ పెట్టెలు కొని ఇచ్చి సరిపెట్టేసేవారు

  • పేదలు పెద్ద చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని వైఎస్ చెప్పేవారు

  • కాలేజి యాజమాన్యాలతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు

  • యాజమాన్యాలు ఫీజులను 70వేలు, లక్షకు పెంచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు

  • ఇంతకుముందు ఇచ్చినట్లు పూర్తిగా ప్రభుత్వం ఫీజు ఇస్తే పర్వాలేదు. కానీ, చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఇచ్చేది 30వేలు మాత్రమేనట

  • మిగిలిన మొత్తం అంతా ఆ పేదవాడు అప్పులు చేసి, ఇంట్లో భూములు అమ్ముకుని చదువుకోవాల్సి వస్తోంది

  • చదువుల కోసం భూములు తాకట్టు పెట్టుకుందామనుకుంటే లోన్లు కూడా రాని పరిస్థితిలో ప్రభుత్వం నడిపిస్తున్నారు

  • ఈ ప్రభుత్వం పోవాలి.. నాన్నగారి పాలన రావాలని చెబుతున్నా

  • ఏ పేదవాడు అప్పులపాలు కాకుండా చదువుకునే పరిస్థితి వస్తుంది

  • రైతులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి


  • పేరుపేరునా ప్రతి అక్క, చెల్లెలికి, ప్రతి అవ్వ, తాతకు, ప్రతి సోదరుడు,సోదరికి పేరుపేరునా కృతజ్ఞతలు

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top