పసందైన పుచ్చకాయ..

పసందైన పుచ్చకాయ..


ఎదులాపురం: ప్రస్తుతం ఎండలు అదరగొడుతున్నాయి... ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ఆహార పదార్థాలను తీసుకునేందుకు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ఒక నెల ముందుగానే ఎండ తీవ్రత పెరిగిపోయింది. వేసవిలో ప్రజలు పుచ్చకాయలను పసందు గా తింటుంటారు. ప్రసుత్తం ఆదిలాబాద్‌ మార్కెట్లో పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువు అధికంగా ఉండడంతో వీ టి కొ నుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు.



శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది..

నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయాలను వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఎండ తీవ్రతకు గొంతు తడారిపోకుండా, ఎండలో తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన వ్యక్తి తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిస్తోంది. చెమట రూపంలో విసర్జన జరిగిన శరీరంలోని నీటి శాతం పడిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో దోహద పడుతోంది.



పట్టణంలో విక్రయాలు..

ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రస్తుతం పుచ్చకాయల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ వీటిపై ఆసక్తి క నబర్చుతారు. రుచిగా తియ్యగా ఉండే ఈ కా యల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ప్రస్తు తం పుచ్చకాయలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయల రుచిచూడటానికి అందరు ఇష్టపడతారు. కిలో పుచ్చకాయ ధర రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.


ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండలు ముదిరి శరీరంలోని ఖనిజ లవణాలు బయటకు పో యే తరుణంలో పుచ్చకాయ తినడం శ్రేయస్క రం. ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఆదిలాబాద్‌ పట్టణంలోని కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, బస్టాండ్‌ ఏరియా, శివాజీచౌక్, దస్నాపూర్, గాంధీచౌక్, అంబేద్కర్‌లతో పాటు తదితర ముఖ్య కూడళ్ల లో వీటి విక్రయాలు జోరందుకుంటున్నాయి. భానుడు తన ప్రతాపం చూపించడం ఆరంభిం చడంతో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటూ పు చ్చకాయలపై దృష్టి పెట్టారు. దాహర్తిన్ని తీర్చేందుకు పుచ్చకాయలు ఉపయోగకరం.



ప్రజలను ఆకర్షించేలా..

పుచ్చకాయలు మార్కెట్లో అందుబాటులోకి వ చ్చాయి. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని హోల్‌సేల్‌కు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారులు తోపుడు బండ్లపై పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా ఐస్‌ గడ్డలపై ముక్కలు చేసిన పుచ్చకాయలను ఉంచుతూ అమ్ముతున్నారు. రూ.10 కి ఒక ప్లేట్‌ చొప్పున అమ్ముతూ, వాటిపై మసాల, ఉప్పు లాంటివి చల్లి ఇస్తుండడంతో ప్రజలు మరింత ఇష్టంగా వాటిని తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top