విమ్స్‌కు కొత్త డెరెక్టర్ రాక ?

విమ్స్‌కు కొత్త డెరెక్టర్ రాక ?


ఇన్‌చార్జ్ డెరైక్టర్ పదవికి  స్వసి ్తపలకనున్న ప్రభుత్వం..?



బళ్లారి (తోరణగల్లు): వైద్యసేవల్లో ఆధునిక వసతులు కలిగిన ఆసుపత్రిగా రాష్ట్రంలోనే ద్వితీయ సా ్థనాన్ని పొందిన విమ్స్ ఆసుపత్రికి గత నాలుగేళ్లుగా పర్మనెంట్ డెరైక్టర్‌ను నియమించకుండా ఇన్‌చార్జ్‌ల నియామకాలతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. ఇన్‌చార్జ్ డెరైక్టర్లు తమ పదవి ఎప్పుడు ఊడుతుందోనని ఆ పదవిని కాపాడుకోవడానికే పాకులాడుతూ విమ్స్ అభివృద్ధిని విస్మరించారు. దీంతో ఆసుపత్రి లో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోయా యి. మరో పక్క రోగులకు కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. తాగునీరు, పలు విభాగాల్లో చికిత్సకు అవసరమైన యంత్రాలు మూలపడినా పట్టించుకున్న పా పాన పోలేదు. రోగులకు వైద్యసేవలు అందక కు య్యో మొర్రో అంటున్నా వినిపించుకొనే నాధుడు క రువయ్యాడు. నానాటికి దిగజారుతున్న విమ్స్ అభివృద్ధి పట్ల జిల్లాలోని పలుసంఘాలు, ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ విమ్స్‌కు పర్మనెంట్ డెరైక్టర్ నియామకంపై దృష్టి సారించింది. దీనికి తోడు కోర్టులో ఉన్న విమ్స్ డెరైక్టర్ పోస్టు వివాదం ముగిసింది.



డెరైక్టర్ నియామక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి కోర్టు సూచించడం మార్గం సుగమమైంది. అయితే పర్మనెంట్ డెరైక్టర్ పోస్టు కోసం ఏడుగురు సీనియర్ వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డెరైక్టర్ పదవిని దక్కించుకోవడానికి రాజకీయ నాయకులతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పని చేసిన ఇద్దరు ఇన్‌చార్జ్ డెరైక్టర్లు, ఇతర జిల్లాలో వైద్య కళాశాలకు డెరైక్టర్‌గా పని చేస్తున్న మరో వైద్యుడి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో గతంలో ఇన్‌చార్జ్ డెరైక్టర్‌గా పని చేసిన ఓ వైద్యుడు పర్మనెంట్ డెరైక్టర్‌గా వారం రోజుల్లో నియామక ఉత్తర్వులు తీసుకోనున్నారని విశ్వనీయ సమాచారం.  

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top