ఎస్‌ఎస్‌ఆర్ కన్నుమూత

ఎస్‌ఎస్‌ఆర్ కన్నుమూత - Sakshi


 తమిళ నాట నట దిగ్గజం, రాజకీయ నాయకుడు ఎస్ ఎస్ రాజేంద్రన్ (86) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు.  ప్రస్తుతం ఎస్ ఎస్ ఆర్ స్థానిక తేనాంపేటలో కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మైలాపూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కన్నుమూశారు.                                            

 

 పిన్న వయసు నుంచే కళామతల్లి ఒడిలో ఎదిగిన రాజేంద్రన్ ఆరేళ్ల వయసులోనే రంగస్థల నటుడిగా పరిచయమయ్యారు. తరువాత చిత్ర రంగ ప్రవేశం చేసి తొలుత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కథానాయకుడిగా ఎదిగారు. ఆయన శోక సముద్రపు నటన తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్ ఎస్ రాజేంద్రన్‌కు తొలుత నటుడిగా గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం మొదలాలి. ఆ తరువాత కుముదం, పరాశక్తి, పూంపుహార్, శారద, శివగంగై సమై, మనోహర, తై పిరందాల్ వళి పిర్‌క్కుం చిత్రాలు ఎస్ ఎస్ రాజేంద్రన్ నటనా ప్రతిభకు చిరునామాగా నిలిచారుు. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఎస్‌ఎస్‌ఆర్ లక్ష్య నటుడిగా పేరొందారు. దివంగత మహా నటుడు ఎంజీఆర్, శివాజి గణేశన్‌ల సహ నటుడిగా 1950 - 60 దశకంలో ప్రముఖ నటుడిగా వెలుగొందారు. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తదితర నలుగురు ముఖ్యమంత్రులతో కలసి పని చేసిన ఘనత రాజేంద్రన్‌ది.

 

 ఎస్ ఎస్ రాజేంద్రన్ పూర్తి పేరు సెటపట్టి సూర్యనారాయణ రాజేంద్రన్. ఈయన సొంత ఊరు ఉసిలంపట్టు సమీపంలోని సేట పట్టి గ్రామం. 1928 డిసెంబర్ 21న జన్మించారు. నటుడిగా రాణిస్తున్న సమయంలోనే రాజ కీయ రంగ ప్రవేశం చేశారు. 1962లో డీఎంకే తరపున తేని అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. భారతదేశంలోనే తొలిసారి శాసన సభ్యుడైన నటుడు ఎస్‌ఎస్‌ఆర్. 1970లో డీఎంకే తరపున పార్లమెంటు సభ్యుడు అయ్యారు. ఆ తరువాత 1981లో అన్నాడీఎంకే తరపున ఆండిపట్టి శాసనసభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. అదే విధంగా తమిళనాడు చిన్న మొత్తాల పొదుపు శాఖకు వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. దక్షిణ భారత నటీనటుల సం ఘం అధ్యక్షుడిగా ఆరేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఎంజీఆర్, శివాజి గణేశన్‌ల తరం నుంచి నటి తరం హీరోలు శింబుల వరకు కలసి నటించారు.

 

 కుటుంబ నేపథ్యం

 ఎస్ ఎస్ రాజేంద్రన్‌కు ముగ్గురు భార్యలు. మొద టి భార్య పేరు పంకజం. ఈమెకు నలుగురు కుమారులు ఇళంగోవన్, రాజేంద్రకుమార్, కలైవన్, సెల్వరాజ్‌తోపాటు కుమార్తె భాగ్యలక్ష్మి ఉన్నారు. అరుుతే  ఎస్‌ఎస్‌ఆర్ తనతో పాటు నటించిన విజయకుమారిని రెండో వివాహం చేసుకున్నారు. ఈమెకు కొడుకు రవికుమార్ ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా విజ యకుమారి, ఎస్ ఎస్ ఆర్ విడిపోయారు. దీంతో 1974లో తామరై సెల్విని మూడో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు కన్నన్, కుమార్తె లక్ష్మి ఉన్నారు.

 

 ఎస్ ఎస్ ఆర్ నటుడు మాత్రమే కాదు కథకుడు, మాటల రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఈయన 1960లో తంగరత్తం అనే చిత్రా న్ని స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించారు. ఇందులో విజయకుమారి, జయలలిత కథానాయికలు. ఎస్ ఎస్ ఆర్ పిక్చర్స్, రాజేంద్ర పిక్చ ర్స్, మరుదపాండి పిక్చర్స్ అనే మూడు నిర్మాణ సంస్థలు ఎస్ ఎస్ ఆర్‌వే. పలు చారిత్రక చిత్రాల్లో నటించిన ఎస్ ఎస్ ఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించరాదని నిర్ణయించుకున్నారు. చెన్నైలోని ఎస్ ఎస్ ఆర్ పంకజం సినిమా థియేటర్ ఆయనదే.

 

 షూటింగ్‌లు రద్దు  

 ఎస్ ఎస్ ఆర్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ శుక్రవారం షూటింగ్‌లను రద్దు చేసింది. మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత ఎస్ ఎస్ ఆర్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి ఎస్ ఎస్ ఆర్ భౌతిక కాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. దురై మురుగన్, పొన్‌ముత్తు రామలింగం, పొన్‌ముడి, ఎ.వి.వేలు, ఎ.రాజా, ఆర్ ఎం వీరప్పన్, ఇంద్రకుమారి, జి.కె.వాసన్ తదితర రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు, ఎస్ ఎస్ ఆర్ పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఎస్‌ఎస్‌ఆర్ భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  ఇందులో సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top