మద్దతివ్వండి

మద్దతివ్వండి - Sakshi


చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి జయలలితపై పోటీకి దిగుతున్న సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్దతు కూడగట్టే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. రోడ్లకు అడ్డంగా వెలిసిన బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు ద్వారా ప్రజల్లో పలుకుబడిని పెంచుకున్న ట్రాఫిక్ రామస్వామి ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగంలో నాణ్యమైన నిర్మాణాలు ఎలాసాధ్యమని కిందిస్థాయి సిబ్బంది విమర్శిస్తున్నారు.



ఉపేక్షిస్తే లాభం లేదని నిర్ణయించుకున్న సిబ్బంది సినిమా ఒరవడిని ఆశ్రయించారు. అవినీతిని విడనాడకుంటే పేర్లను బహిర్గతం చేస్తూ బ్యానర్లను పెడతామని ఠాగూర్ సినిమా తరహాలో  హెచ్చరికలు జారీచేశారు. హెచ్చరించినట్లుగానే 30 మంది లంచావతారుల పేర్లతో నెలరోజుల క్రితం సచివాలయం ఎదురుగా బ్యానర్ పెట్టారు. అయితే పోలీసులు వెంటనే దానిని తొలగించారు.



మరికొన్ని రోజుల తరువాత మరో బ్యానర్ పెట్టారు. అనేక పోస్టర్లు వెలిసాయి. మక్కల్ సైదిమయ్యం పేరుతో ఈ బ్యానర్ల వ్యవహారం క్రమేణా రాష్ట్రమంతా పాకడం లంచావతారులనేగాక సంబంధిత శాఖలను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారులను సైతం అప్రతిష్టపాలు చేసింది.

 

కమిషనర్‌ను కలిసిన ఐఏఎస్ సంఘం:

తమిళనాడు ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు డేవిదార్, కార్యదర్శి రాజారామన్ తదితరులు శుక్రవారం చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిసి విజ్ఞప్తి అందజేశారు. 12 మంది ఐఏఎస్ అధికారులను అవినీతి పరులుగా పేర్కొంటూ ఈనెల 14వ తేదీన నగరంలో అనేక ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు వేశారని వారు చెప్పారు. అయితే అందులో పేర్కొన్న వివరాలు పూర్తిగా అవాస్తవాలని, ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్నారని వారు అన్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అధికారులను రచ్చకీడుస్తున్న వారిపై  కేసులు బనాయించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

       

ప్రభుత్వంలో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు నేరుగా కమిషనర్‌ను కలిసి వేడుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top