ఆ తప్పునకు బాధ్యులెవరు?


 సాక్షి, చెన్నై : ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నివేదిక దాఖలు చేసి, తప్పు చేసిన వ్యవహారానికి బాధ్యత వహించేదెవ్వరు అని డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండానే కోర్టుకు నివేదిక చేరి ఉండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముల్లై పెరియార్ డ్యాంకు ఎల్‌టీటీఈల రూపంలో ముప్పు ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై ఉండడం ఇటీవల  వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో రాద్దాంతం బయలు దేరింది.ప్రతి పక్షాలు,తమిళాభిమాన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నాయి. అయితే, తప్పును కప్పి పుచ్చుకునే రీతిలో ఆ నివేదికతో తమకు సంబంధం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం జత పరిచిన నివేదికలో ఎల్‌టీటీఈల ప్రస్తావన వచ్చి ఉన్నదని, దీనికి వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు.

 

 దీనిపై స్పందించిన ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రి ఓ పన్నీరు సెల్వం, రాద్దాంతం చేస్తున్న వాళ్లపై విమర్శలు గుప్పిస్తూ, తప్పును కప్పి పుచ్చుకునే యత్నం చేయడాన్ని డిఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా పరిగణించారు. బాధ్యులెవ్వరు : మంగళవారం కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పు తాము చేయలేదంటూ దాటవేత దోరణి అనుసరిస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్రం తన  నివేదికను జత పరిచిన విషయం ఎలా తెలియకుండా ఉంటుందని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండానే నివేదిక కోర్టుకు ఎలా చేరి ఉంటుందని ప్రశ్నించారు. అయితే, సీఎంకు తెలియకుండా ఆ నివేదికకు ఆమోదం తెలపడంలో తమరి పాత్ర ఉందా..? అని ప్రశ్నించారు. ఎందు కంటే, ప్రజా పనుల శాఖ మంత్రిగా తమరు ఉండటం వల్లే, తమరికి కూడా తెలియకుండా ఆ నివేదిక ఎలా జత పరిచి ఉంటారోనని మండి పడ్డారు.

 

 చేసిన తప్పును కప్పి పుచ్చుకునే యత్నం చేయడంతో పాటుగా , ఎల్‌టీటీలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును తాము ఎత్తి చూపితే , అది విమర్శ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత తాను, తదనంతరం రాందాసు, వైగో, ఇలా అన్ని పార్టీల నాయకులు ప్రశ్నించే వరకు , ఎల్‌టీటీఈల గురించి ఆ నివేదికలో ఏమున్నదో తెలియక పోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నివేదిక ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో సీఎం జయలలిత తనను, అధికారుల్ని ప్రశ్నించి సమాచారం రాబట్టారని ఓ పన్నీరు సెల్వం పేర్కొనడం గమనించాల్సి విషయంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రతి పక్షాలు గళం విప్పే వరకు , జరిగిన తప్పు తమరెందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.  తప్పు జరిగిన విషయానికి వివరణ ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా..? అని ప్రశ్నించారు. వివరణ ఇచ్చారు సరే, జరిగిన తప్పుకు బాధ్యులెవరు అన్నది స్పష్టం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top