సంకీర్తన దండియాత్ర ప్రారంభం


సాక్షి, ముంబై: విలేపార్లేలోని ప్రముఖ ఇస్కాన్ సంస్థకు చెందిన సుమారు 1,500 మంది భక్తులు సంకీర్తన దండి యాత్ర ప్రారంభించారు. ఇందులోభాగంగా ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. శ్రీకృష్ణ  చైతన్యస్వామి రాష్ట్రాన్ని సందర్శించి ఈ సంవత్సరంతో 500 ఏళ్లు పూర్తయ్యింది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని స్వామి  నడిచిన మార్గంలో పయనించాలనే లక్ష్యంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు చెప్పారు.



గత నెల 29వ తేదీన కొల్హాపూర్‌లోని ఇస్కాన్ మందిరం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా వీరంతా పండరీపూర్‌లోని విఠలుడిని దర్శించుకున్నారు. ఆ తరువాత పుణే. సాతారాల మీదుగా నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుని మళ్లీ ఈ నెల 22న సాతారాలో ఇస్కాన్ మందిరానికి చేరుకుంటారు. ఈ యా త్రలో భాగంగా ఈ భక్త బందం దాదాపు 386 కి.మీ. కాలినడకన పయనిస్తుంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top