కొత్త రూటర్‌తో తగ్గనున్న ఇంటర్‌నెట్ కష్టాలు

కొత్త రూటర్‌తో తగ్గనున్న ఇంటర్‌నెట్ కష్టాలు


సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ప్రముఖ నెట్‌వర్కింగ్ కంపెనీ ‘స్మార్ట్‌లింక్ నెట్‌వర్క్ సిస్టమ్స్ లిమిటెడ్’  ఏసీ750 అనే వైర్‌లెస్ డ్యూయల్ బ్యాండ్ బ్రాడ్‌బ్యాండ్ రూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. డీజీ-బీఆర్4400ఏసీ అనే ఈ కొత్త తరం రూటర్‌కున్న రెండు ప్రత్యేక ఎల్‌ఈడీలు...2.4 జీహెచ్‌జడ్, 5 జీహెచ్‌జడ్ ఫ్రీక్వెన్సీలను సూచిస్తాయని, తద్వారా కనెక్టెడ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను సులభంగా గుర్తించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో వివరించింది.



భారతీయ ఇంటర్‌నెట్ స్పేస్ అనేక డివైజ్‌లలో విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో బహుళ ఇంటర్‌నెట్ డివైజ్‌లు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ అత్యుత్తమంగా పని  చేయడానికి ఈ రూటర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా రూటర్‌లోని ఇన్‌బిల్ట్ గిగాబైట్ వై-ఫై, కంటెంట్‌ను వేగంగా  డౌన్‌లోడ్ చేసుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది.



పెద్ద వీడియో, మ్యూజిక్ ఫైళ్లను సత్వరమే వినియోగించుకోవడానికి కూడా వీలవుతుందని తెలిపింది. దీని ధర రూ.3,490 అని, ఇళ్లు, వ్యాపారాల్లో అత్యుత్తమ పనితీరుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని వివరించింది. అమ్మకాల తదనంతర సేవలను కూడా సమర్థంగా అందిస్తామని తెలిపింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top