ఉద్యోగులకు శుభవార్త!


♦ పెయిడ్స్ లీవ్స్ కోసం పని దినాలు తగ్గించిన ప్రభత్వుం

♦ 240 నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం

♦ వెల్లడించిన కార్మిక శాఖ

 

 ముంబై : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు శుభవార ్త. పెయిడ్ లీవ్స్ కోసం పని దినాలను 240 నుంచి 90 రోజులకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను 1948 ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించింది. ఈ మేరకు కార్మిక శాఖకు చెందిన అధికారులు ఆదివారం వెల్లడించారు. రాత్రి వేళల్లో మహిళలు పని చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రస్తుతం ఫ్యాక్టరీల చట్టం ప్రకారం మహిళలకు సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు పని చేయకూడదు. మరోవైపు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. వారంలో అన్ని రోజులు షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం 1948 ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్’ చట్టంలో మార్పులు చేసిందని, అయితే ప్రతి ఉద్యోగికి ఒక రోజు సెలవు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.



ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మందిని షాపు యజమానులు నియమించుకుంటారని, ఎక్కువ వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. వారంలో అన్ని రోజులు తెరిచి ఉంచేందుకు దుకాణాలు లెసైన్సు పొందాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక తీర్మానం చేసిందని వెల్లడించారు. వారం రోజుల్లో ప్రభుత్వం లెసైన్సు మంజూరు చేయకపోతే డబ్బులు చెల్లించిన రసీదును లెసైన్సుగా పరిగణిస్తామన్నారు. కాగా, వారం రోజులు షాపులు తెరిచి ఉంచడానికి కాంట్రాక్టు లెసైన్సు కూడా అవసరమన్నారు. దరఖాస్తు చేసుకున్న వారంలోపు ఈ లెసైన్సు అందకపోతే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులకు సంబంధించిన రసీదును లెసైన్సుగా పరిగణిస్తామన్నారు.



 బాయిలర్లకు స్వీయ ధ్రువీకరణ

 బాయిలర్లు, ఎకనమైసర్లకు స్వీయ ధ్రువీకరణ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని కార్మికశాఖ అధికారులు అన్నారు. ఫ్యాక్టరీలలో యంత్రాల తయారీకి స్టీమ్ బాయిలర్లు అవసరమని, బాయిలర్లను ఏడాదికొకసారి, ఎకనమైజర్లను రెండేళ్లకొకసారి పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఇంతకు ముందు వార్షిక తనిఖీ కోసం ఫ్యాక్టరీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేద న్నారు. 1000 చ దరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న కంపెనీలు ప్రస్తుతం బాయిలర్ పనులకు సంబంధించి ఇంజినీర్లను నియమించుకుంటున్నాయని, వీరు స్వీయ ధ్రువీకరణ, వార్షిక తనిఖీ చేసి కార్మిక శాఖకు నివేదిక అందిస్తారని తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top