సోషల్ మీడియాపై నిఘా

సోషల్ మీడియాపై నిఘా - Sakshi


* 15 మంది అధికారులకు  ప్రత్యేక శిక్షణ

* నగర పోలీస్ కమిషనరేట్‌లో  తాత్కాలిక మానిటరింగ్  ల్యాబ్  ఏర్పాటు

* పనిలో నిమగ్నమైన నిపుణులు

* అందుబాటులోకి ప్రత్యేక సాఫ్ట్‌వేర్




 బెంగళూరు :  నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్ది నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుతం 10 కేసులు తీసుకుంటే కనీసం 4 కేసులు ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషియల్ మీడియాతో సంబంధం ఉన్నవే. ఇలాంటి కేసుల దర్యాప్తు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. దీంతో మేలుకున్న రాష్ట్ర హోం శాఖ ముఖ్యంగా నగర పోలీసులు ఈ సోషియల్ మీడియాల పై ప్రత్యేకృదష్టి పెట్టనున్నారు. ఇందుకోసం నగర పోలీసులో మెరికల్లాంటి 15 మంది అధికారులు ఢిల్లీలో శిక్షణ పొంది ఇటీవలే నగరానికి తిరిగి వచ్చారు. గత పదిహేను రోజులగా పెలైట్ ప్రతిపాదికన నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ల్యాబ్‌లో సోషియల్ మీడియాల పనిపట్టడంలో నిమజ్ఞమై ఉన్నారు.  



సోషియల్ మీడియా ద్వారా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నుంచి సమాచారాన్ని రవాణా చేస్తున్నారన్న విషయం గమనించడం చాలా కష్టమైన పని. అంతే కాక  సోషియల్ మీడియాలో వచ్చిన ప్రతి సమాచారాన్ని విశ్లేషించడం కూడా కుదరదు. అయితే ప్రత్యేక విధానం ద్వారా ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషియల్ మీడియాల్లో నిర్ధిష్ట విషయం అప్‌లోడ్ అయిన వెంటనే కనుగొనడానికి కొన్ని ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా పోలీసులు సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం ‘సోషియల్ మీడియా మానిటరింగ్ ల్యాబ్’ను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా హాకింగ్ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు.



మరోవైపు ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలను అనుసరించి సోషియల్ మీడియాలోని సమాచారం పై ఫిర్యాదు చేసిన సమయంలోనే, చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అయితే మానిటరింగ్ ల్యాబ్ ఉండటం వల్ల సుమోటోగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకూ ఇలాంటి ఏర్పాటు ముంబై, హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. ‘ఈ విషయం పె నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘నేరాలు కొత్తపోకడలను అనుసరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా మేము కూడా మా నిఘా, దర్యాప్తు విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా  సోషియల్ మీడియా పై నిఘా వహించడానికి ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.       

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top