లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్.. మహిళల అరెస్టు

లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్.. మహిళల అరెస్టు


చెన్నై: విదేశాల నుంచి చాటుమాటుగా బంగారం తరలిస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఒకే రోజు ఏడుగురు మహిళలు పట్టుబడడం చెన్నై విమానాశ్రయం చరిత్రలో ఇదే ప్రథమం. కౌలాలంపూర్ నుంచి గురువారం రాత్రి చెన్నైకి వచ్చిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో దిగిన రాణి (43)ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె లోదుస్తుల్లో 14 బంగారు బిస్కెట్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్క బంగారం బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉందని చెప్పారు.



అలాగే సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో నగరానికి వచ్చిన శ్రీలంకకు చెందిన వడివళగి (48) పింగారా (40) శివగంగైకి చెందిన మారియమ్మాళ్ (50), జీనత్ (38)లను తనిఖీ చేశారు. ఈ నలుగురు మహిళలు 1550 గ్రాముల బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డారు. సింగపూర్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి చెందిన కనియమ్మాళ్ (39) తన సెల్ ఫోన్లో బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్ను ఉంచి తెస్తుండగా దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురు మహిళల నుంచి ఒకే రోజు రూ. కోటి విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరందరినీ విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో పట్టుబడిన మహిళలంతా స్మగ్లింగ్ ముఠాకు చెందిన వారుగా నిర్థారించినట్లు చెప్పారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top