ముంబైలో వచ్చే 24 గంటలు భారీ వర్షాలు

ముంబైలో వచ్చే 24 గంటలు భారీ వర్షాలు


ముంబై: భారీ వర్షాలకు ముంబై మహానగరం వణికిపోతోంది. శుక్రవారం రాత్రి ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలో పాటు శివారున లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వచ్చే 24 గంటలు ముంబైలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.



భారీ వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఎంసీ అధికారులు.. నీళ్లను పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నారు. శుక్రవారం బీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్కు 4500 ఫిర్యాదులు వచ్చాయి. ముంబైలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు బీఎంసీ అధికారులు చెప్పారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top