పోలీస్.. నో ఆప్షన్

పోలీస్.. నో ఆప్షన్ - Sakshi

శాఖలో విభజన గోల

ఆప్షన్లు ఇచ్చి పంపించాలని వినతి

రూరల్‌కు బదిలీపై పలువురి అసంతృప్తి

దీర్ఘకాలిక సెలవు పెట్టేందుకు కొందరి సమాయత్తం

టీఎస్‌ఎస్పీ వారిని జిల్లాలకు కేటాయిస్తే పరిష్కారం

 

 

వరంగల్‌ : వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్‌డ్‌ పోలీసుల విభజన ప్రతీ సారి గందరగోళానికి దారి తీస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా జిల్లాల్లో నేతలు, కార్యాలయాల్లో బందోబస్తు కోసం ఆర్మ్‌డ్‌ పోలీసులను బదిలీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2012లో రూరల్, అర్బన్ పోలీసు విభాగాలు ఏర్పాటు కావడంతో ఎలాంటి ఆప్షన్లు లేకుండానే సిబ్బందిని విభజించారు. దీనిపై ఏఆర్‌ విభాగం పోలీసులు కోర్టును ఆశ్రయించడం, పోలీసు ఉన్నతాధికారులకు పలుమార్లు మొర పెట్టుకోవడంతో మళ్లీ రూరల్, అర్బన్ ఆర్మ్‌డ్‌ పోలీసుల ఉమ్మడి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలకు కేటాయించారు. ఈ సందర్భంగా నా¯ŒS లోకల్‌ కోటా తో పాటు సుమారు 20 ఏళ్లకు పైగా అర్బన్ ప్రాంతంలో  సర్వీసు పూర్తి చేసుకున్న పోలీసులను రూరల్‌ ప్రాంతాల కు కేటాయించారు. దశాబ్దాలుగా తాము నగరంలోని స్థిరపడిపోయి పిల్లలు ఉన్నత చదువుల్లో ఉన్నందున ప్రస్తుతం ఉన్న పోస్టింగ్‌ నుండి రూరల్‌ జిల్లాలకు పంపొద్దని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం కొత్త జిల్లాల్లో పాలన సాగాలంటే తాత్కాలికంగా వెళ్లక తప్పదని చెప్పిన బాస్‌లు రెండు నెలల అనంతరం పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

భూపాలపల్లి, మానుకోటకు కేటాయింపుతో..

కమిషనరేట్‌లోని ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న పోలీసుల బదిలీల సందర్భంగా ఆప్షన్లు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. కమిషనరేట్‌ పరిధిలో వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ జిల్లాలు పూర్తిగా అర్బ¯ŒS ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న ఏఆర్‌ పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు అర్బ¯ŒS నుంచి సుమారు 250మందిని బదిలీ చేయడంతో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన పలువురు పోలీసులు ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్నారు. వారికి ఆప్షన్లు ఇస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది.

 

టీఎస్‌ఎస్పీ నుంచి వచ్చేందుకు సుముఖం...

తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీసు(టీఎస్‌ఎస్‌పీ) బెటాలియన్లలో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉద్యోగం చేస్తున్నారు. వారిలో సుమారు 300మందికి పైగా ఉమ్మడి జిల్లాలకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్ర స్తుతం నూతన జిల్లాలు ఏర్పడినందున వారు తమ సొంత జిల్లాలకు వచ్చేందుకు సముఖంగా ఉండడం వల్ల వారి ని ఏఆర్‌ విభాగంలోని తీసుకుంటే ఈ సమçస్య పరిష్కారమవుతుందని సంఘాల నాయకులు చెబుతున్నారు.

 

కొత్త జిల్లాల్లో పలు ఇబ్బందులు...

కొత్త జిల్లాలకు కేటాయించిన ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌) పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు కేటాయించిన ఏఆర్‌ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టేందుకు సమాయత్తవుతున్నట్లు సమాచారం. ఈనెల 13వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఏఆర్‌ పోలీసులు తమ సమస్యలు ’సాక్షి’తో ఏకరవు పెట్టారు. 

 

తమకు పడుకునేందుకు సరైన వసతి లేదని, తినేందుకు ఏ హోటల్‌కు వెళ్లినా రూ.70కు తక్కువ కావడం లేదని చెప్పారు. అద్దె గదుల కోసం ఆరా తీసీ ఏడాది అద్దె ముందే అడ్వాన్సు గా ఇవ్వాలని యాజమానులు చెప్పడంతో దిక్కు తోచడం లేదని తెలిపారు. దీనికి తోడుగా ఉన్నతాధికారులు డ్యూటీ టైం అయిపోయినా ఉండాలని వేధిస్తున్నారని వాపోయారు. ఇవన్నీ తట్టుకోలేక దీర్ఘకాలికంగా సెలవులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పలువురు తెలిపారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top