పోలీసులు ఉక్కిరి బిక్కిరి


  • నేడు కేంద్ర మంత్రి,రేపు సీఎం రాక,

  • 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

  • విధుల ఒత్తిడితోసతమతం

  •  

    తిరుపతి క్రైం : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పనిచేస్తున్న పోలీసులు ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక వైపు నేరాల సంఖ్య పెరగడం, మరోవైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పనిభారం పెరి గి ఒత్తిడికి గురవుతున్నా రు.


    నగరంలో శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసే లోపే  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుపతి వస్తున్నారు. 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. దీంతో ఇంట్లో వారితో కూడా గడపలేకుండా పోతున్నారు.

     

    వీఐపీల తాకిడి

    ఆధ్యాత్మిక జిల్లా కావడంతో నిత్యం వీఐపీల తాకిడి ఉంటోంది. అదేవిధంగా ఏదో ఒక విషయంపై రాజ కీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేస్తుం టారు. వీటికితోడు నేరాలతో పోలీసులపై పని భారం అమాంతం పెరిగిపోయింది. ప్రముఖల రక్షణ కోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది.


    జిల్లాలో ఏ సంఘటనలు చోటు చేసుకున్నా అటువైపు పరుగులు తీయాల్సి వస్తోం ది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకాక ముందే వీఐపీల పర్యటనతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

     

     అటకెక్కిన వారాంతపు సెలవు

     జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువ కావడంతో వారాంతపు సెలవు ఇస్తామని గతంలో అధికారులు చెప్పారు. అమలు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు జిల్లాకు నెలకు రెండుసార్లయినా వస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒక మంత్రి, ఏదో ఒక కమిటీ సభ్యులు వస్తూనే ఉంటారు. దీంతో ఎర్రటి ఎండలో పోలీసులు నిలబడి డ్యూటీ చేయాల్సిందే.

     

     3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

     తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ తేదీ నుంచి 11 వరకు జరగనున్నాయి. బందో బస్తులో 30 మంది డీఎస్పీలు, 65 మంది సీఐలు, 220 మంది ఎస్‌ఐలు, 470 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1700 మంది పీసీలు, 500 మంది హోంగార్డులు, 200 మంది మహిళా పీసీలు, 500 మంది మహిళా హోంగార్డులు, 15 టీమ్‌లకు చెందిన ఏఆర్, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది పాల్గొననున్నారు. అప్పటి వరకు ఈ హడావుడి తగ్గే అవకాశం లేదు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top