అప్పుడు మౌనమేల?

అప్పుడు మౌనమేల?


► పన్నీరుకు స్టాలిన్  ప్రశ్న

సాక్షి, చెన్నై : అధికారంలో ఉన్నప్పుడు మౌనం వహించి, ఇప్పుడేమో విశ్వాసాన్ని చాటుకోవడం వెనుక ఆంతర్యమేమిటో అని మాజీ సీఎం పన్నీరుసెల్వంను డీఎంకే కార్యనిర్వాహక అధ్య క్షుడు ఎంకే స్టాలిన్  ప్రశ్నించారు. అమ్మ బొమ్మల్ని తొలగించాల్సిందేనని ప్రధాన ప్రతి పక్ష నేత హోదాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో ఎంకే స్టాలిన్  సమావేశవైున విషయం తెలిసిందే.


అమ్మ జయలలిత బొమ్మల్ని తొలగించాలని పట్టుబట్టే అధికారం స్టాలిన్ కు ఎవరిచ్చారని, ఆయనకు సంబంధం ఏమిటంటూ, తమ అమ్మను ప్రజల మదిలో నుంచి తొలగించేందుకు డీఎంకే తీవ్ర కుట్రలు చేస్తున్నదని  అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగానే ప్రశ్నలతో ఎదురుదాడికి దిగాయి. అయితే, వారందరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నట్టుగా, కేవలం మాజీ సీఎం పన్నీరుసెల్వం సంధించిన ప్రశ్నలపై  ఎదురుదాడికి దిగుతూ స్టాలిన్  స్పందించారు.   



మౌనమేలనోయి..

సుప్రీంకోర్టు తీర్పు మేరకు దోషిగా ముద్ర పడ్డ వారి ఫొటోలను ఎలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతారని, ప్రభుత్వ పథకాల్లో పొందుపరుస్తారని ప్రశ్నించారు. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా ముద్రపడ్డ వారిని దోషి అని పిలవకుండా, మరెలా పిలవాలో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, పదవిలేని సమయంలో అమ్మభక్తి, విశ్వాసం అని వ్యాఖ్యలు సంధించడంశోచనీయమని మండిపడ్డారు.


నిజంగా అమ్మమీద గౌరవం, విశ్వాసం ఉండి ఉంటే, పదవి చేతిలో ఉన్నప్పుడు ఆమె మరణంపై న్యాయవిచారణకు ఆదేశించి ఉండాలని సూచించారు. పదవీ సుఖం ప్రస్తుతం దూ రం కావడంతో అమ్మ మరణం వెనుక మిస్టరీ అంటూ తెర మీదకు కొత్తకొత్త వ్యాఖ్యల్ని తెస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం అమ్మ భక్తి, విశ్వాసం అని వ్యాఖ్యానించడం కాదు అని, నిజవైున సేవకుడిగా పదవిలో ఉన్నప్పుడే స్పందించి ఉంటే, అందరూ ఆహ్వానించి ఉండే వారని మండిపడ్డారు.



త్వరలో చరమ గీతం:

ఇక డీఎంకే కేడర్‌ను ఉద్దేశించి స్టాలిన్ స్పందిస్తూ మార్చి ఒకటో తేదీన తన 65వ బర్త్‌డేను ఆర్బాటాలతో చేయవద్దని సూచించారు. ప్రజల కు ఉపయోగ పడే విధంగా కార్యక్రమాలు సాగాలని సూచించారు. అలాగే, తనకు ఎలాంటి విలువైన కా నుకల్ని సమర్పించ వద్దు అని, ఏదేని పుస్తకాల రూపంలో అందిస్తే చాలు అని విజ్ఞప్తి చేశారు. నమ్మకంతో ముందుకు సాగుదామని, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాసంక్షేమం లక్ష్యంగా మరెన్నో పోరాటాలను సాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవినీతి ఊబిలో కూరుకున్న బినామీ ప్రభుత్వాన్ని, ప్రజావ్యతిరేక శకు్తల్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఇందుకు సమయం ఆసన్నమవుతోందన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top