కాంగ్రెస్‌ బండారం బయటపెడతాం..

కాంగ్రెస్‌ బండారం బయటపెడతాం.. - Sakshi

  • ప్రాజెక్టులను అడ్డుకుంటున్న పాపం వారిదే: హరీశ్‌రావు

  • వారి తీరుపై పుస్తకాలు ముద్రించి ఊరూరా పంచుతాం

  • నారాయణఖేడ్‌: సాగు నీటికోసం తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ నేతల తీరును ఎండగడుతూ పుస్తకాలు, కరపత్రాలు ముద్రించి ఊరూరా పంచి పెడతామన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. టీఎన్జీవోల సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ పాలించిన పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రాజెక్టులు నిర్మించలేదని విమర్శించారు.



    టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూ డదని కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు సృష్టిసు ్తన్నారని విమర్శించారు. ఈ వివరాలను మొత్తం ఆధారాలతో సహా బయటపెడతా మని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో 34 ప్రాజెక్టుల్లో ఒక్కటికూడా పూర్తి చేయలేదని, 10వేల ఎకరాలు ఉన్న ప్రాజెక్టు పూర్తిచేసి ఎకరాన్ని కూడా తడపలేక పోయారన్నారు. తాము కేవలం 10 నెలల్లోనే భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి 58 వేల ఎకరాలకు నీరిచ్చామన్నారు. కాంగ్రెసోళ్లు మల్లన్నసాగర్, కాళేశ్వరం భూసేకరణను అడ్డుకున్నారని, పాలమూరు ఎత్తిపోతలపై ట్రిబ్యునల్‌కు వెళ్లారని హరీశ్‌ అన్నారు.



    కోర్టుల్లో కేసులు వేసిన మహేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డిలు కాంగ్రెస్‌  వారు కాదా? అని ప్రశ్నించారు. కాం ట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచి రెగ్యులరైజ్‌ చేస్తా మంటే కాంగ్రెస్‌ వారు కేసులు వేసి అడ్డు కోలేదా? అని ప్రశ్నించారు. 2014లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని 80 శాతం హామీలు నెరవేర్చామని మంత్రి తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో 500 జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చనున్నట్టు తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top