వాయిదా తీర్మానానికి అధికార పక్షం సభ్యుడి పట్టు..

వాయిదా తీర్మానానికి అధికార పక్షం సభ్యుడి పట్టు.. - Sakshi


బెంగళూరు: శాసనసభలో వాయిదా తీర్మానానికి అధికార పక్షం నాయకుడే పట్టుబట్టిన ఘటన బెళగావిలో జరగుతున్న వర్షాకాల శాసనసభ సమవేశాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... నిధుల విడుదల్లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని దీనిపై చ ర్చించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకు చెందిన ఏ.ఎస్ పాటిల్ నడహళ్లి వాయిదా తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందుకు విపక్షనాయకుడైన శెట్టర్‌తో పాటు పాటు పలువురు జేడీఎస్ నాయకులు మద్దతు తెలి పారు. ఈ సమయంలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఈ విషయంపై చర్చను సోమవారం జరుపుదామన్నారు. అయితే ఇప్పుడే చర్చ జరపాల్సిందేనని నాడహళ్లి పట్టుబట్టారు. అరవై ఏళ్ల నుంచి హైదరాబాద్ కర్ణాటక పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగానే గుర్తింపు పొందిందన్నారు. ఈ విషయంపై చర్చించడానికి అనుగుణంగా పాలక పక్షం నాయకులే వాయిదా తీర్మానానికి సంతకాలు చేశారని వెల్లడించారు. దీంతో కంగుతిన్న ప్రభుత్వ విప్ పీ.ఎం అశోక్ తప్పుడు సమాచారమిచ్చి నాడహళ్లి తమ పార్టీ నా యకులతో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.



అంతేకాకుండా అయ న్ను పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొక రు ఏకవచనంతో దూషించుకోవడం మొ దలు పెట్టారు. వీరిద్దరికీ సర్ధిచెప్పడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా శ్రమిం చాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ కలుగజేసుకుని పాలక పక్షం వారు వాయిదా తీర్మానం పెట్టడం సరికాదన్నా రు. ఈ సంప్రదాయాన్ని మనం మొదటి నుంచి అనుసరిస్తున్నామని తెలి పారు. అటుపై వాయిదా తీర్మానానికి మ ద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన సీ. ఎస్ నాడగౌడ, జీ.టీ పాటిల్ మాట్లాడుతూ...‘నంజుండప్ప నివేదికపై చర్చ కోసం అంటే సంతకాలు చేశాం. అం దులో ఏముందో కూడా మాకు తెలియదు.’ అ న్నారు. ఈ సమయంలో కలుగజేసుకున్న బీజేపీ నాయకుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి ‘బాధ్యతాయుతమైన స్థానం లో ఉండి ఓ కాగితంలో ఏముందో చదవకుండా సంతకాలు ఎలా చేస్తారో’ అని ప్రశ్నించారు. ఈ విషయమై స్పీకర్ చర్యలు తీసుకోవాలని సభాముఖంగా కోరారు. దీంతో స్పీక ర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని చేసి న తప్పుకు క్షమాపణ చెప్పండంటూ స భ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 వాయిదా తీర్మానంలో ఏముందో చదవకుండా సంతకం చేయడం తప్పు. చేసిన తప్పుకు క్షమాపణ కోరండి.’ అని సూచించారు. దీంతో వారు తెలియక చేసిన తప్పు అని దీనికి చింతిస్తున్నామని చెప్పడంతో సభ కార్యకలాపాలు ముం దుకు సాగాయి.      

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top