Alexa
YSR
‘ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగు పడాలి. అందుకు అధికారులు నిబద్ధత, పారదర్శకత, కార్యదీక్షతో పనిచేయాలి.’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంకథ

'జయలలిత కొడుకు'పై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Others | Updated: March 17, 2017 15:38 (IST)
'జయలలిత కొడుకు'పై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ ముందుకు వచ్చిన జే కృష్ణమూర్తి అనే వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఒరిజనల్‌ కాదని, తప్పుడు పత్రాలు సృష్టించాడని స్పష్టం చేసింది. 'ఈ వ్యక్తిని నేరుగా జైలుకు పంపగలను. ఇప్పుడే అతన్ని జైలుకు తీసుకెళ్లమని పోలీసు అధికారులను ఆదేశిస్తా' అంటూ కృష్ణమూర్తిని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జయలలిత, నటుడు శోభన్ బాబులకు జన్మించానని, ఆమె ఆస్తులకు తానే వారసుడినని ఈరోడ్‌కు చెందిన కృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు జయలలిత ఆస్తులన్నింటినీ తనకు అప్పగించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. 'ఫిర్యాదుదారుడు సమర్పించిన డాక్యుమెంట్లను ఎల్‌కేజీ విద్యార్థి ముందు ఉంచినా, ఆ పిల్లాడు వీటిని తప్పుడు పత్రాలని చెబుతాడు. అందుబాటులో ఉన్న ప్రముఖుల ఫొటోను వాటిపై అతికించాడు. అతను తప్పుడు పత్రాలు సృష్టించాడు. కోర్టుతో ఆటలు వద్దు' అని జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. శనివారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట కృష్ణమూర్తిని హాజరు పరచి, అతని ఒరిజనల్ డాక్యుమెంట్లను పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. కృష్ణమూర్తికి మద్దతుగా కోర్టుకు వచ్చిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిని న్యాయమూర్తి మందలించారు. ఇందులో మీ పాత్ర ఏమిటి అని ఆయన్ను ప్రశ్నించారు.

1985లో తాను జయలలితకు జన్మించానని, ఆ మరుసటి సంవత్సరం తనను ఈరోడ్‌కు చెందిన వసంతమణికి దత్తత ఇచ్చారని కృష్ణమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దత్తత పత్రంపై జయలలిత, శోభన్ బాబు, వసంతమణి ఫొటోలు, సంతకాలు ఉన్నాయని, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సాక్షిగా సంతకం చేశారని వెల్లడించాడు. గతేడాది డిసెంబర్ 5న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన సంగతి తెలిసిందే.


చదవండి: జయలలితకు కొడుకు ఉన్నాడా?


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఉగ్రభూతంపై సమరమే!

Sakshi Post

Situation Along China Border In Sikkim Reviewed After Incursion

This is the first time in ten years that there’s tension on Sikkim-China border

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC