ఖోఖో రాష్ట్ర జట్ల ఎంపిక


పంగులూరు : ఖోఖో 18 సంవత్సరాల విభాగంలో రాష్ట్ర బాలబాలికల జట్లను స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఎంపిక చేశారు. ఖోఖో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఖోఖో క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికలు 30 మంది పాల్గొనగా, వారిలో 12 మందిని, బాలురు 40 మంది రాగా, వారిలో 12 మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. 

 

ఎంపికైన జట్లు శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించే 22వ జాతీయస్థాయి దక్షిణాది రాష్ట్రాల బాలబాలికల 18 సంవత్సరాల విభాగం ఖోఖో పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ఎంపికైన జట్లను లాయర్‌ మేకల ఉషారెడ్డి పరిచయం చేసుకున్నారు. పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాలుర జట్టుకు కోచ్‌గా ఎన్‌.ఆవులయ్య (ఐవీఎస్‌), కె.రామారావు (పీఈటీ) మేనేజర్‌గా వ్యవహరిస్తారు. బాలికల జట్టుకు కోచ్‌గా పి.నరసింహారెడ్డి (ఐవీఐఎస్‌), మేనేజర్‌గా ఎం.అనిల్‌కుమార్‌ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి, పీఈటీ హనుమంతరావు, మురళీకృష్ణ, రత్తయ్య, లక్ష్మణరావు, జవహర్‌బాబు పాల్గొన్నారు.



బాలుర జట్టు క్రీడాకారులు వీరే...

కె.స్వామినాథన్‌(ప్రకాశం), డి.వంశీ (ప్రకాశం), ఎల్‌.అప్పలనాయుడు (వెస్ట్‌ గోదావరి), ఎస్‌.రాజేష్‌ (ఈస్ట్‌ గోదావరి), వై.డాల్‌ నాయుడు (క్రిష్ణా), పి.అప్పలరాజు (విజయనగరం), డి.కిరీటి (వైజాగ్‌), టి.శివతలుపులు (వైజాగ్‌), టి.ప్రేమ్‌కుమార్‌ (చిత్తూరు), వి.రాజశేఖర్‌ (అనంతపురం), పి.శివక్రిష్ణ (కడప), ఎన్‌.జయక్రిష్ణా (నెల్లూరు).



బాలికల జట్టు...

కె.ప్రత్యూషా (ప్రకాశం), సీహెచ్‌ ఈశ్వరమ్మ (శ్రీకాకుళం), పి.ప్రియాంక (విజయనగరం), ప్రదీపిక (వైజాగ్‌), కె.శ్యామల (ఈస్ట్‌ గోదావరి), ఎం.విజయశ్రీ (వెస్ట్‌ గోదావరి), టి.ఝాన్సీ (క్రిష్ణా), ఐ.పద్మా (గుంటూరు), వై.ప్రసన్న (నెల్లూరు), పి.చరితా (చిత్తూరు), ఐ.శివహర్షిత (కర్నూలు).

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top