కృషితో ఎదిగిన వ్యక్తి కలాం

కృషితో ఎదిగిన వ్యక్తి కలాం - Sakshi


♦ ఆంధ్ర మహాసభ ట్రస్టీ చైర్మన్ పోతు రాజారాం వ్యాఖ్య

♦ ‘ఎన్నీల ముచ్చట్లు’లో మాజీ రాష్ట్రపతికి ఘననివాళి

 

 సాక్షి, ముంబై : పట్టుదల, కృషితో పేదరికం నుంచి ఒక్కో మెట్టూ ఎదుగుతూ దేశ అత్యున్నత స్థానానికి ఎదిగిన మహోన్నత వ్యక్తి మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మేన్ అబ్దుల్ కలాం అని ఆంధ్ర మహాసభ ట్రస్టీ చైర్మన్ పోతు రాజారాం అన్నారు. ప్రతి పౌర్ణమికి ఆంధ్ర మహాసభ ఆవరణలో నిర్వహించే ‘ఎన్నీల ముచ్చట్లు’ కార్యక్రమంలో రాజారాం మాట్లాడుతూ, కలాం యువతలో నూతనోత్సాహం నింపారని, యువత ఆయన ఆదర్శాలను పాటిస్తే దేశం ఎంతో పురోగతి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివంగత మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంను స్మరించుకున్నారు.



కార్యక్రమంలో అబ్దుల్ కలాంపై ముంబై ప్రజాగాయకుడు నర్సారెడ్డి, నరేంద్ర, గొండ్యాల రమేశ్, నాగెళ్ల దేవానంద్ ఉద్వేగపూరితమైన పాటలు పాడి వినిపించారు. కరీంనగర్ నుంచి వచ్చిన శారద శర్మ, గురువు ప్రాధాన్యం గురించి పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్ర శర్మతోపాటు ఆంధ్ర మహాసభ పరిపాలనా శాఖ ఉపాధ్యక్షులు ద్యావరిశెట్టి గంగాధర్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షులు సంగెవేని రవీంద్ర వేదికను అలంకరించారు.



తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో గుర్రం బాలరాజు, బి.సుబ్రహ్మణ్యం, కట్టరాజు ఊశన్న, కట్ట అశోక్, చిలుక వినాయక్, యెల్ది సుదర్శన్, గుర్రం శ్రీనివాస్, నడిమెట్ల యెల్లప్ప, జి శ్రీనివాస్, గాలి మురళీధర్, ఏవీ అనంతరాం, సంగెవేని రవీంద్ర, నాగేంద్ర శర్మ తదితరులు కవితలు చదివి వినిపించారు. రాధామోహన్, అన్నపూర్ణ, బడుగు విశ్వనాథ్, సుల్గే శ్రీనివాస్, కోడూరి శ్రీనివాస్ కలాం గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు మర్రి జనార్దన్, కోశాధికారి బడుగు విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులు గాలి మురళీధర్, గంజి గోవర్ధన్, వాసాల గంగాధర్ సాహిత్య విభాగ సంయుక్త కార్యదర్శి పిట్ల బాలకృష్ణ పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top