ఆ తర్వాతే నేను

ఆ తర్వాతే నేను - Sakshi


నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ల రేసులో వెనుక పడుతున్నారనే విషయాన్ని సినీ వర్గాలు గణాంకాలతో చెబుతున్నాయి. ఇంతకు ముందు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. మహేశ్ బాబు, జూనియర్ ఎన్‌టీ ఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యువ స్టార్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ జత కట్టారు. అలాంటిది ఇప్పుడు వారందరూ కాజల్‌ను పక్కన పెట్టేశారన్న టాక్ ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో విశాల్ సరసన పాయుం పులి, ధనూష్‌తో మారి చిత్రాలు చేస్తున్నారు.

 

 ఇక, కొత్తగా కమిట్‌మెంట్స్ ఏమీ లేవు. దీంతో కాజల్ పెళ్లికి సిద్ధం అయ్యిందన్న ప్రచారం జోరందుకుంది. అలాంటి వారికి సమాధానం ఇచ్చేలా ఈ ఉత్తరాది భామ స్పందిస్తూ, అనుష్క, నయన తార, త్రిష తన కంటే సీనియర్లు అని, వాళ్లే ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదన్నారు. అలాంటి  తనకు ఇప్పుడు పెళ్లి తొందరేమోచ్చిందన్నారు. నయనతార, అనుష్క, త్రిష  పెళ్లి చేసుకున్న తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని, అయినా, తనకు తగిన వరుడు ఇంకా తారస పడలేదన్నారు.

 

  ప్రస్తుతం అలాంటి అన్వేషణ జరుగుతున్నదన్నారు. అయితే, కాజల్ సోదరి రెండేళ్ల క్రితమే ముంబైకు చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో బిజీ అయ్యారు. ఈమె ఎవరి ప్రేమలోనైనా పడ్డారా..? అన్న ఆరా కూడా తీస్తున్నారు. కాజల్ కోలీవుడ్‌లో సమంత, నయన తారల స్థాయికి చేరుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకు తన పారితోషికాన్ని కూడా తగ్గించుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top